STOCKS

News


నిఫ్టీ 11,264 పైన నిలిస్తే 11,600కే

Wednesday 12th September 2018
Markets_main1536737435.png-20199

నిఫ్టీకి 11,264 స్థాయి వద్ద కీలక మద్దతు ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. దీనికి పైన స్థిరపడితే అప్పుడు ఇండెక్స్‌ 11,600-11,750 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. 11,265-11,260 దిగువకు పడిపోతే అప్పుడు ఇండెక్స్‌ 11,200-11,175 స్థాయికి పడిపోయే అవకాశముందని తెలిపారు. అలాగే ఆర్‌ఎస్‌ఐ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. అందువల్ల ఇండెక్స్‌లో పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉండొచ్చని తెలిపారు. వచ్చే 3-4 వారాలో 12 శాతం దాకా రిటర్న్‌ అందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..

నాట్కో ఫార్మా
వీక్లి చార్ట్‌లో నాట్కో ఫార్మా రూ.840 వద్ద ఉన్న అసెండింగ్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నెట్‌లైన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌కు సిద్ధంగా ఉంది. మంచి వ్యాల్యూమ్స్‌తో రూ.840కు పైస్థాయిలో బ్రేక్‌ ఔట్‌ జరిగితే అప్‌ట్రేండ్‌కు అవకాశముంది. అప్పుడు స్టాక్‌ ధర రూ.900-930 శ్రేణికి వెళ్లొచ్చు. డైలీ చార్ట్‌లో హైయర్‌ హై, హైయర్‌ లోస్‌ను ఏర్పరుస్తోంది. అంటే బలమైన బుల్లిష్‌నెస్‌ను చూసిస్తోంది. ప్రస్తుతం ఇది ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. అప్‌ట్రెండ్‌ను సంతరించుకుంటోంది. ఆర్‌ఎస్‌ఐ కూడా బుల్‌ జోన్‌ లోయర్‌ ఎండ్‌ వద్ద అంటే 40 లెవెల్‌లో అప్‌సైడ్‌కు టర్న్‌ తీసుకుంది. అందువల్ల రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో పెరుగుదల ఉంటుంది. రూ.780 స్టాప్‌లాస్‌తో రూ.828-832 శ్రేణి వద్ద ఈ స్టాక్‌ను రూ.900-930 టార్గెట్‌ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చు.

కార్బొరెండ్రమ్‌ యూనివర్సల్‌
వీక్లి చార్ట్‌లో కార్బొరెండ్రమ్‌ యూనివర్సల్‌ అసెండింగ్‌ ట్రైయాంగిల్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ఇది తదుపరి అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. రూ.385 స్థాయికి పైన స్థిరమైన ట్రేడ్‌ జరిగితే అప్పుడు అప్‌ట్రెండ్‌ రూ.410-425 స్థాయికి వెళ్లొచ్చు. డైలీ చార్ట్‌లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ కూడా డబుల్‌ బాటమ్‌ను ఏర్పరచిన తర్వాత అప్‌సైడ్‌ వైపు మళ్లింది. రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోంది. రూ.360 స్టాప్‌లాస్‌తో రూ.384-386 శ్రేణి వద్ద రూ.410-425 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఏబీబీ ఇండియా
డైలీ చార్ట్‌లో ఏబీబీ ఇండియా సైడ్‌వేస్‌ కన్సాలిడేషన్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. ఇది బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోంది. వీక్లి చార్ట్‌లో పాజిటివ్‌ రివర్సల్‌ను ఏర్పచిన తర్వాత అప్‌సైడ్‌వైపు టర్న్‌ తీసుకుంది. రానున్న సెషన్లలో పెరుగుదల ఉండొచ్చు. ఆర్‌ఎస్‌ఐ బుల్‌ జోన్‌లో ఉంది. రూ.1,300 స్టాప్‌లాస్‌తో రూ.1,385-1,395 శ్రేణి వద్ద రూ.1,460-1,535 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ ‍గ్రూప్‌ షేర్లు

Wednesday 12th September 2018

ముంబై:- హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో  బుధవారం పలు అడాగ్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గ్రూప్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 5నుంచి 4శాతం క్షీణించాయి.   రిలయన్స్‌ క్యాపిటల్‌ :- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.440.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మంగళవారం తొలి తైమాసికంలో ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో

కోలుకున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు

Wednesday 12th September 2018

రెండు వరుస ట్రేడింగ్‌ల్లో తీవ్ర నష్టాలపాలైన ఎఫ్‌ఎంసీజీ షేర్లు బుధవారం కోలుకుంటున్నాయి. ఉదయం సెషన్లో ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.23 శాతం వరకూ ర్యాలీ చేసింది. ఉదయం గం.11:30ని.లకు సూచి గత ముగింపు(30,067.55)తో పోలిస్తే 562 పాయింట్ల లాభపడి 30,629.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచిలో అత్యధికంగా డాబర్‌ ఇండియా, ఐటీసీ షేర్లు

Most from this category