STOCKS

News


బైబ్యాక్‌ రూట్లో డిజిన్వెస్ట్‌మెం‍ట్‌

Friday 16th November 2018
Markets_main1542363257.png-22101

ముంబై: నిర్థేశిత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే బైబ్యాక్‌ అస్త్రాన్ని సంధించనున్న తెలుస్తోంది. ఈ ఏడాదిలో రూ.80,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంగా వెల్లడించిన మోడీ సర్కార్‌ ఇప్పటివరకు ఈ మొత్తంలో కనీసం నాలుగింట ఒక వంతును కూడా సమకూర్చుకోలేకపోయింది. గడిచిన ఏడున్నర నెలల్లో కేవలం రూ.15,000 కోట్లను మాత్రమే అందుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో రూ.20,000 కోట్లను ఉపసంహరణల ద్వారా పొందనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా వెల్లడైంది. తద్వారా నిర్థేశిత లక్ష్యంలో కనీసం సగానికైనా చేరినట్లువుతుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బైబ్యాక్‌ మార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడైంది. గతనెలలో రూ.4,400 కోట్ల విలువైన బైబ్యాక్‌ ప్రకటనలు జరుగగా.. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.1,628 కోట్లు, ఎన్‌ఎల్‌సీ ఇండియా రూ.1,249 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ రూ.200 కోట్లు, కేఐఓసీఎల్‌ రూ.214 కోట్లు, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ రూ.505 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ రూ.600 కోట్లు క్యుమిలేటీవ్‌ బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఈ స్థాయి ప్రకటనలు జరగడానికి ప్రధాన కారణం పెట్టుబడుల ఉపసంహరణలో భాగమేనని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలు కూడా బైబ్యాక్‌లను ప్రకటించాయి. ఎన్‌ఎండీసీ, ఐఓసీలను కూడా ప్రభుత్వం బైబ్యాక్‌కు రమ్మని ప్రభుత్వం కోరినట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. 

ప్రభుత్వం బైబ్యాక్‌ మార్గాన్నే ఎంచుకుంటే.. ఈఏడాది ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టతరం కాదనేది పలువురు మార్కెట్‌ నిపుణుల అంచనా. ఎందుకంటే, దాదాపు 16 ప్రభుత్వ రంగ సంస్థలు సునాయాసంగా ఈ మార్గంలో ప్రభుత్వానికి సహకరించే స్థాయిలో ఉన్నాయి. కోల్‌ ఇండియా వద్ద రూ.38,154 కోట్ల నికర నగదు ఉండగా.. ఎన్‌ఎండీసీలో రూ.5,430 కోట్లు, ఇంజినీర్స్‌ ఇండియా వద్ద రూ.2,573 కోట్లు, ఎంఓఐఎల్‌ వద్ద రూ.2,394 కోట్లు ఉన్నాయి. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గెయిల్ ఇండియాల వద్ద రూ.2,000 కోట్లమేర ఉండగా.. ఎస్‌జేవీఎన్‌, ఎన్‌బీసీసీ ఇండియాల దగ్గర ఉన్నటువంటి నికర నగదు రూ.1,500 చొప్పున ఉంది. భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, ఐటీడీసీ, బాల్మెర్ లారీ ఇన్వెస్ట్మెంట్స్, మిశ్రా దత్తు నిగంల వద్ద రూ.84 కోట్ల నుంచి రూ.800 కోట్ల మేర నెట్‌ క్యాష్‌ ఉన్నట్లు వెల్లడైంది. వీటిలో 10 శాతం నుంచి 25 శాతం వరకు బైబ్యాక్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



You may be interested

10,650 పైన నిఫ్టీ

Friday 16th November 2018

రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. నేడు ట్రేడింగ్‌లో కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.71 స్థాయికి బలపడటంతో సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ముఖ్యంగా స్టాక్‌

వెలుగులో టెలికాం షేర్లు

Friday 16th November 2018

టెలికం రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం షేర్లకు సూచీగా ఉన్న ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ టెలికాం సూచీ ఇంట్రాడేలో 5.09 శాతం లాభపడింది. టెలికాం రంగంలోని ప్రధాన షేర్లైన ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, జీపీటీఎల్‌, టీటీఎంఎల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు దాదాపు 13శాతం లాభపడ్డాయి. అత్యధికంగా ఐడియా సెల్యూలార్‌ 15శాతం చేసింది. ఎయిర్‌టెల్‌ 8.50శాతం లాభపడి నెలన్నర గరిష్టానికి చేరుకుంది. జీపీటీఎల్‌ హాత్‌వే

Most from this category