STOCKS

News


వీటి బైబ్యాక్‌ దేనికి సంకేతం?

Thursday 11th October 2018
Markets_main1539282509.png-21055

ఓ కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేస్తోందంటే, ఆ కంపెనీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందన్న సంకేతాన్నిస్తున్నట్టే. సదరు కంపెనీ షేరు ధర వాస్తవ విలువకు చాలా తక్కువ స్థాయికి చేరినా లేదా కంపెనీ వద్ద పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండి, వ్యాపార అవసరాలకు అంతగా నిధుల అవసరం లేని సందర్భాల్లోనూ కంపెనీలు, షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తుంటాయి. తద్వారా వాటాల విలువను పెంచే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో మిగులు నిల్వలతో చేసిన బైబ్యాక్‌ చేసిన షేర్ల రూపంలో కొంత ఈక్విటీ తగ్గడం వల్ల, మిగిలిన వాటాల ఆర్జన మెరుగుపడుతుంది. మరి తాజాగా కొన్ని ప్రభుత్వరంగ కంపెనీలు బైబ్యాక్‌ ప్రకటించాయి. వీటిపై దృష్టి సారించొచ్చన్నది విశ్లేషకుల సూచన.

 

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
రుణ రహిత కంపెనీ. ప్రస్తుతం రూ.3,000 కోట్ల నగదు నిల్వలు కంపెనీ వద్ద ఉన్నాయి. ఇది కంపెనీ నెట్‌వర్త్‌కు సమానం. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌లో సగానికి సమానం. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం విక్రయాలకు 6.7 రెట్లకు సమానమైన రూ.12,000 కోట్ల మేర ఆర్డర్‌ బుక్‌ ఉంది. కొత్తగా షిప్‌బిల్డింగ్‌ కేంద్రం అందుబాటులోకి వస్తోంది. షిప్‌ రీపెయిర్‌ సామర్థ్యం కూడా పెరగనుంది. బైబ్యాక్‌ అన్నది నగదు నిల్వలు తగ్గించుకుని, రిటర్న్‌ రేషియో పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,154 కోట్లలో 10 శాతం బైబ్యాక్‌కు కేటాయించినా గానీ కంపెనీ వద్ద ఇంకా భారీగానే నగదు నిల్వలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.32 ఈపీఎస్‌ అంచనా ప్రకారం స్టాక్‌ 9 పీఈ వద్ద ట్రేడవుతోంది.

 

ఎన్‌ఎల్‌సీ ఇండియా (గతంలో నైవేలీ)
ఇప్పటికే ఈ స్టాక్‌ 34 శాతం దిద్దుబాటుకు గురైంది. కంపెనీ డివిడెండ్‌ రాబడి 6 శాతంగా ఉంది. ఇగ్నైట్‌ ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థ ఇది. వార్షిక క్యాష్‌ ఫ్లో రూ.800-1,000కోట్లుగా ఉంది. ఈ రంగంలో ఇదే తక్కువ. 2017-18లో 16 శాతం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ నమోదు చేసింది. అయినప్పటికీ నగదు నిల్వలు ఉండడంతో, ఒక్కో షేరును రూ.88 చొప్పున రూ.1,249 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ ఈక్విటీ 10 శాతం తగ్గిపోతుంది. 

 

నాల్కో
52 వారాల గరిష్ట స్థాయి రూ.97.65 నుంచి... ప్రస్తుత ధర రూ.66.80 వరకు చూస్తే 31 శాతం దిద్దుబాటుకు గురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం ఈ షేరు 6 రెట్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ వద్ద రూ.3,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ నికర విలువలో ఇది 30 శాతానికి సమానం. ఇందులో కొంత మేర బైబ్యాక్‌కు వినియోగిస్తే... షేరు ధరకు మంచి మద్దతు లభిస్తుంది. రాబడుల నిష్పత్తి కూడా మెరుగుపడుతుంది.  
 You may be interested

మార్కెట్లు పడినా... సిప్‌ పెట్టుబడుల హోరు

Friday 12th October 2018

గత రెండేళ్లుగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మార్కెట్లలో మంచి ర్యాలీ ఒక విధంగా సానుకూలతను ఇచ్చింది. అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన కార్యక్రమాల పాత్ర కూడా ఉంది. కానీ, గత నెలన్నర రోజుల్లో మార్కెట్లు భారీ కరెక్షన్‌ను చవిచూసిన విషయం తెలిసింది. ఆగస్ట్‌ 29 తర్వాత మొదలైన కరెక్షన్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ మ్యూచువల్‌

ఈ మూడింటిలో వ్యాల్యుయేషన్‌కు ఛాన్స్‌..

Thursday 11th October 2018

మార్కెట్‌ ఇంకా ఓవర్‌వ్యాల్యుతోనే ఉందన్నారు మెర్కులస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ. ఇండియన్‌ మార్కెట్‌ తన ఫెయిర్‌ వ్యాల్యుకు 10-15 శాతం దూరంలో ఉందని తెలిపారు. అయితే ఐటీ, ఫార్మా, ఎగుమతి ఆధారిత ఆటో రంగ స్టాక్స్‌లో విలువకు అవకాశముందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్స్‌ ఓవర్‌ వ్యాల్యుయేషన్స్‌తో ఉన్నాయని తెలిపారు. వీటిల్లో ఇంకా

Most from this category