STOCKS

News


నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు..!

Wednesday 26th September 2018
Markets_main1537939787.png-20586

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఇంట్రాడేలో 1.50శాతం క్షీణించింది. నేటి ఉదయం మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా నేటి ఉదయం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌  సూచీ 1శాతం ర్యాలీ చేసింది. అనంతరం క్షణాల్లో అరంభ లాభాల్ని కోల్పోయిన ఈ సూచీ ఇంట్రాడేలో 1.50శాతం నష్టపోయింది. అత్యధికంగా ఆంధ్రాబ్యాంక్‌ షేరు 5శాతం నష్టపోయింది. అలాగే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంకు షేర్లు 1.50శాతం నుంచి 1శాతం వరకు నష్టపోయాయి. వాటితో పాటు, అలహాదాబాద్‌, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇండియన్‌ బ్యాంకు 1శాతం లాభపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకు, కెరనరా బ్యాంకు షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 2,781 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకుల వార్షిక సమావేశం జరిపిన సంగతి తెలిసిందే.



You may be interested

బ్రోకరేజ్‌లు మక్కువ చూపుతున్న టాప్‌ టెన్‌ స్టాక్స్‌!

Wednesday 26th September 2018

ఏడాది కాలంలో దాదాపు 60 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న పది స్టాకుల్లో బ్రోకరేజ్‌లు పొజిషన్లు తీసుకుంటున్నాయి. వాటి వివరాలు.. 1. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 352. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ కౌంటర్లో కవరేజ్‌ ఆరంభించింది. రిటైల్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బలమైన సంస్థ. పోటీ ఎక్కువగా ఉన్నా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. పొదుపులు పెట్టుబడులుగా మారతుండడం కంపెనీకి కలిసివచ్చే అంశం. 2. ఎన్‌ఓసీఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 256.

వచ్చే నెల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో 'ది బిగ్ బిలియన్ డేస్‌' (టీబీబీడీ) సేల్ ప్రారంభించనుంది. టీబీబీడీ అయిదో ఎడిషన్‌ అక్టోబర్ 10 నుంచి 14 దాకా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వాటన్నింటిపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వచ్చే నెల పండుగ సీజన్‌లో వివిధ ఈ-కామర్స్ సైట్లలో

Most from this category