STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం డౌన్‌

Monday 28th January 2019
Markets_main1548658604.png-23847

ఐసీఐసీఐ షేర్ల పతనం బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సోమవారం బ్యాంకు నిఫ్టీ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (27,115.30)తో పోలిస్తే 1.40శాతం క్షీణతో 27,115.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  వీడియోకాన్‌కు రుణ కేటాయింపు కుంభకోణ సమస్యలు ఐసీఐసీఐ బ్యాంకును వెంటాడుతున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లోనూ ఆ బ్యాంకు షేర్లు 4.50శాతం నష్టపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన యస్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ , ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేర్లు 2శాతం క్షీణించాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు అరశాతం పడిపోయాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడగా, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం లాభపడ్డాయి.

నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల పతనం కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్ సెషన్స్‌లో 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 8.50శాతం నష్టపోయింది. బ్యాంకు శుక్రవారం వెలువరించిన నిరుత్సాహకరమైన క్యూ3 ఫలితాలు ఇందుకు కారణమయ్యాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ 3శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌ 1శాతం పతనమయ్యాయి. పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి. ఉదయం గం.11:30నిల.కు ఇండెక్స్‌ గత ముగింపు 2శాతం నష్టంతో 2,908.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు మూడు రోజుల ముందు నేడు ప్రభుత్వ బ్యాంకుల సీఈవోలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌ గోయిల్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సైతం హాజరయ్యే అవకాశం ఉంది.



You may be interested

ఫార్మా, మెటల్‌, అటో షేర్ల అమ్మకాలు

Monday 28th January 2019

ఫార్మా, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. పలు బ్రోకరేజ్‌ సంస్థలు పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ హెల్త్‌కేరే షేర్లకు ‘‘సెల్‌’’ రేటింగ్‌ కేటాయిస్తూ షేరు టార్గెట్‌ ధరను రూ.2000లకు కుదించడంతో ఈ షేరు అత్యధికంగా 7శాతం నష్టపోయింది. సిప్లా, కేడిలా హెల్త్‌కేర్‌ షేర్లు 2.50శాతం పతనంతో 52-వారాల కనిష్టానికి పతనమయ్యాయి. అలాగే అరబిందో ఫార్మా షేర్లు 3.50శాతం క్షీణించాయి. సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌, బయోకాన్,

కొనసాగుతున్న పసిడి ర్యాలీ

Monday 28th January 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ తటస్థ విధానాన్ని అవలంభివచ్చనే అంచానాలతో సోమవారం సైతం పసిడి ర్యాలీ కొనసాగుతుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు ర్యాలీ చేసి 1,303డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనం, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఫెడ్‌ వడ్డీరేట్ల యధాతథ అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో  22.60డాలర్లు ర్యాలీ చేసిన కీలక 1300డాలర్లపై

Most from this category