రెండోరోజూ పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల ర్యాలీ
By Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా శక్తికాంత్ నియామకం బ్యాంకింగ్ రంగ షేర్లకు ఉత్సాహానిచ్చింది. ముఖ్యంగా మొండిబాకీల ప్రక్షాళనకు సంబంధించి సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు బుధవారం లాభాల బాట పట్టాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్ వరుసగా రెండో రోజూ ర్యాలీ చేస్తూ బుధవారం 2.50శాతం లాభపడింది. గత ట్రేడింగ్‌లో పీఎస్‌యూ ఇండెక్స్ 2.50శాతం ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్, అలహదాబాద్ బ్యాంక్, యూనిటైడ్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్ షేర్లు 7 నుంచి 4శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ షేర్లు 3నుంచి 1శాతం లాభపడ్డాయి.
You may be interested
ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్ సిగ్నల్స్
Wednesday 12th December 2018మార్కెట్లో బుల్స్ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. మంగళవారం ముగింపు ప్రకారం 38 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్ ఏవరేజ్ కన్వర్జన్స్ డైవర్జన్స్) ఇండికేటర్ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో యస్‌బ్యాంక్, బయోకాన్, ఇండియన్ బ్యాంక్, గ్లెన్‌మార్క్ ఫార్మా, ఎన్ఐఐటీ టెక్, ఫోర్టిస్ హెల్త్, నెల్కో, సుందరం ఫైనాన్స్, బోష్, టీటీకే
టాప్‌గేర్‌లో అటో షేర్లు
Wednesday 12th December 2018ప్రపంచమార్కెట్లో పెరిగిన అటో షేర్లకు అనుగుణంగా బుధవారం దేశీయ మార్కెట్లోనూ అటోరంగ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ 3.50శాతం ర్యాలీ చేసింది. అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై టారీఫ్‌లను తగ్గించడానికి సిద్ధమైనట్లు చైనా ప్రకటించింది. అర్జెంటీనాలో జరిగిన జీ-20 సదస్సులో ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై చైనా ప్రస్తుతం