STOCKS

News


అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Friday 8th February 2019
Markets_main1549610046.png-24088

  • 6శాతం క్షీణించి యూనియన్‌ బ్యాంక్‌ షేరు

దాదాపు ఏడాదిన్నర తరువాత ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక నిధులపై వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి లోనుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకింగ్‌ దాదాపు 2శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 5శాతం క్షీణించాయి. పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. కెనరా బ్యాంక్‌ 3శాతం పతనమవగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం పడిపోయాయి. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,940.60)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి 2,880 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

టాటా మోటర్స్‌షేరుపై అనలిస్టులు ఏమంటున్నారు?

Friday 8th February 2019

క్యు3 ఫలితాల ప్రభావంతో టాటామోటర్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో కుప్పకూలింది. ఇంట్రాడేలో దాదాపు 29 శాతం పతనమైంది. జేఎల్‌ఆర్‌ దెబ్బ కంపెనీ ఫలితాలపై గట్టిగా పడింది. దీంతో పలు అనలిస్టులు కంపెనీ ఈపీఎస్‌ టార్గెట్‌ను 25 శాతం వరకు తగ్గించారు. ఇకపై జేఎల్‌ఆర్‌ విషయమై మరిన్ని ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల ఫలితంగా ఇంట్రాడేలో దశాబ్దకాలంగా చూడని పతనాన్ని కంపెనీ షేరు చవిచూసింది. ఇకమీదట ఈ షేరులో పెద్దగా

కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాల వివరాలు

Friday 8th February 2019

అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండు 125 శాతం చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా మెప్పించింది. ఈ కాలంలో నికరలాభం రూ.712 కోట్లు సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.66 శాతం అధికం. టర్నోవరు రూ.4,336 కోట్ల

Most from this category