News


అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 9th October 2018
Markets_main1539073213.png-20977

ముంబై:- మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా మంగళవారం మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం నష్టపోయింది. అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం పతనమవ్వగా, విజయా బ్యాంక్‌ 1.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే ఇండియన్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయింది. మరోవైపు ఇదే సూచీలోని ఐడీబీఐ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(2,703.50)తో పోలిస్తే 1.12శాతం నష్టంతో 2,673.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఎన్నికలొస్తే మార్కెట్‌కు పండుగే!

Tuesday 9th October 2018

ఎలక‌్షన్స్‌ అనంతరం ర్యాలీకే ఎక్కువ ఛాన్స్‌ మార్కెట్లలో ప్రవేశించేందుకు ఇదే మంచి తరుణమా? అవునంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఎన్నికలకు ముందు మార్కెట్లో ప్రవేశిస్తే ఎన్నికల అనంతరం మంచి లాభాలతో బయటకు రావచ్చంటున్నారు. ఇందుకు గత నిదర్శనాలను చూపుతున్నారు. గత 27 సంవత్సరాల డేటా పరిశీలిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికలయ్యాక రెండేళ్లలో సూచీలు భారీ లాభాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దఫా మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నందున

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ షేర్లు: లోయర్‌ సర్య్కూట్‌

Tuesday 9th October 2018

ముంబై:- తీవ్ర చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ మాతృ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తాజాగా రూ. 20 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీలకు చెందిన కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఫలితంగా నేడు బీఎస్‌ఈలో గ్రూప్‌నకు చెందిన షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ లిమిటెడ్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.9.81ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే

Most from this category