STOCKS

News


మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Tuesday 10th July 2018
Markets_main1531212579.png-18168

ముంబై:- వరుసగా మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు పటిష్టమైన ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచి మంగళవారం ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.2:00 ని.లకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.36శాతం లాభపడి 2,854 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ ఒక్క ఐడీబీఐ షేరు తప్ప.., మిగతా అన్ని షేర్లు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆంధ్రా బ్యాంక్‌ షేర్లు 3నుంచి 2శాతం లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంకు, అలహాదాబాద్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు షేర్లు 2నుంచి 1శాతం ర్యాలీ చేయగా, యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంకు షేర్లు 1నుంచి అరశాతం లాభపడ్డాయి. అయితే ఐడీబీఐ బ్యాంకు షేరు అరశాతం నష్టపోయింది.You may be interested

ట్రంప్‌ ట్వీట్‌తో ఫార్మా ర్యాలీకి పగ్గాలు?

Tuesday 10th July 2018

ఫైజర్‌ సహా ఇతర ఫార్మా కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మండిపడ్డారు. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఫార్మాషేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. పలు సంవత్సరాల మందగమనం అనంతరం ఇటీవలే ఫార్మా షేర్లలో ర్యాలీ ఆరంభమైంది. అయితే ట్రంప్‌ తాజా ట్వీట్‌ ఈ ర్యాలీకి చెక్‌ పెట్టవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో ఫైజర్‌, సన్‌ఫార్మా, లుపిన్‌, అరబిందో షేర్లు సుమారు ఒక

ఈ స్టాకుల్లో ఏంఏసీడీ బుల్లిష్‌

Tuesday 10th July 2018

ఈ వారం సూచీలు తిరిగి బుల్‌ మూడ్‌లోకి మారాయి. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సంకేతాలు దేశీయ సూచీలను ముందుకు నడిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు చార్టుల్లో 132 కంపెనీల షేర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టాకుల్లో ఎంఏసిడి ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఈ విధంగా ఎంఏసిడి సూచిక పాజిటివ్‌గా మారిన స్టాకుల్లో ఎల్‌ అండ్‌టీ, బీఓబీ, జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌ఱ, హెక్సావేర్‌ టెక్నాలజీ, యాక్సిస్‌

Most from this category