3శాతం నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్
By Sakshi

ముంబై:- ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా బ్యాంకింగ్ షేర్లు నష్టాల బాట పట్టాయి. అందులో భాగంగా ఎన్ఎస్ఈలోని ప్రభుత్వరంగ బ్యాంకు సూచి ఇంట్రాడేలో దాదాపు 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు సూచి గత ముగింపు(2,777.80)తో పోలిస్తే దాదాపు 2.75శాతం (71 పాయింట్లు) నష్టంతో 2,706.55 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా సెంట్రల్ బ్యాంకు 6శాతం నష్టపోయింది. ఇండియన్ బ్యాంకు 5శాతం, బ్యాంక్ఆఫ్బరోడా 4శాతం, ఎస్బీఐ బ్యాంకు 3శాతం, కెనరా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు షేర్లు 2శాతం నష్టపోయాయి. వాటితో పాటు సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు 1శాతం క్షీణించగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, పీఎన్బీ షేర్లు అరశాతం నష్టపోయాయి. అయితే ఐడీబీఐ బ్యాంకు షేరు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్ అవుతోంది.
మార్కెట్లో సూచీల నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. మిడ్‌సెషన్ సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాల కారణంగా ఎన్ఎస్ఈలోని ఫార్మా, ఐటీ, తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ సూచి అత్యధికంగా 3శాతం నష్టపోయింది.
You may be interested
అంచనాలు తల్లకిందులు
Friday 5th October 2018అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా మూడు రోజుల పాటు సమావేశమై... ఒక్క నివారణ చర్య
సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్..
Friday 5th October 2018ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 1:20 సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 34,667 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 10,409 పాయింట్ల వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలపై కేంద్ర ప్రకటన నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ భారీగా పతనం కావడం, అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పడిపోవడం, ఆర్బీఐ మానిటరీ పాలసీ