STOCKS

News


నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Friday 7th September 2018
Markets_main1536304812.png-20058

  • 2శాతం నష్టపోయిన ఎస్‌బీఐ షేరు

మిడ్‌సెషన్‌ సమయానికి స్తబ్దుగా ట్రేడ్‌ సాగుతున్న మార్కెట్‌ ర్యాలీలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వ రంగ షేర్లకి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఇంట్రాడేలో అత్యధికంగా 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (3161)తో పోలిస్తే 1.21శాతం నష్టంతో 3,124.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈసూచీలోని మొత్తం 11 షేర్లకు గానూ 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ 2శాతం నష్టపోయి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకుంది. ఓరియంటల్‌ బ్యాంక్‌ 1.50శాతం పతనమవగా, కెనరా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1నుంచి అరశాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఇండియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఆంధ్రా బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

వచ్చే ఏడాది కాలానికి టాప్‌-5 స్టాక్స్‌

Friday 7th September 2018

వచ్చే ఏడాది కాలానికి గానూ ఇన్వెస్ట్‌ చేయడానికి అనువైన టాప్‌-5 స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్‌: లార్సెన్‌ అండ్‌ టుబ్రో రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,350 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,734 రిటర్న్‌ అంచనా: 22 శాతం కంపెనీ మేనేజ్‌మెంట్‌ భవిష్యత్‌పై ధీమాగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కల్లా రెవెన్యూను రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే మర్జిన్లను 10

నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ .. 12,620

Friday 7th September 2018

2019, 2020 ఆర్థిక సంవత్సరాల ఈపీఎస్‌ అంచనాల ఆధారంగా చూస్తే నిఫ్టీ 2019 మార్చి టార్గెట్‌ 12,620 అని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ డైరెక్టర్‌, సీఐవో శైలేంద్ర కుమార్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు మార్కెట్లకు రిస్క్‌ అని పేర్కొన్నారు. అలాగే ఈ అంశాలు కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదలకు కారణమౌతాయని

Most from this category