News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 4th January 2019
Markets_main1546585955.png-23409

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2శాతం లాభపడింది. బ్యాంకులకు రుణాలను ఇచ్చే సామర్థం తగ్గిపోయిన నేపథ్యంలో క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిందిగా గురవారం భారత రిజర్వు బ్యాంక్‌ను పార్లమెంటరీ ప్యానెల్‌ కోరింది. బాసెల్‌ 3 నిబంధనలను మించి క్యాపిటల్‌ అడెక్వసీ నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేయడాన్ని కమిటీ ప్రశ్నించింది. అలాగే సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)కు సంబంధించిన విధానాన్ని సమీక్షించాలని సూచించింది. ఈ సానూకూలాంశంతో శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్‌లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు లాభాల బాట పట్టాయి. ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3శాతం లాభపడింది. సిండికేట్‌ బ్యాంక్‌ 2.50శాతం, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. అలాగే కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 1.50శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ అరశాతం ర్యాలీ చేశాయి. ఇక ఒక్క సెంట్రల్‌ బ్యాంక్‌ మాత్రం అరశాతం నష్టపోయింది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో చోటు దక్కించుకుంది.



You may be interested

ఒడిదుడుకులకు సిద్ధంకండి!

Friday 4th January 2019

మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ సూచన కొత్త ఏడాది మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. స్వల్పకాలానికి మార్కెట్‌ రిస్కు డౌన్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగడం, గృహనిర్మాణ రంగంలో రికవరీకి మరికొంత కాలం పట్టవచ్చని అభిప్రాయపడింది. ఏడాది చివరకు నిఫ్టీ టార్గెట్‌ను 11,000 పాయింట్లుగా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ రెండంకెల స్థాయిని

రూపాయి జోరు... ఐటీ షేర్ల బేజారు..!

Friday 4th January 2019

డాలర్‌ మారకంలో రూపాయి విలువ జోరుతో శుక్రవారం ఐటీ షేర్లు బేజారెత్తుతున్నాయి. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి గతముగింపు(70.17)తో పోలిస్తే 21 పైసలు బలపడి 70 స్థాయికి దిగువున 69.96 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ముడిచమురు ధరలు పతనం, డాలర్‌ బలహీనత తదితర కారణాలతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలపడింది. రూపాయి ర్యాలీ డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లను

Most from this category