STOCKS

News


పతనబాటలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Monday 16th July 2018
Markets_main1531720495.png-18339

ముంబై:- ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు సోమవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో దాదాపు 2శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.11:00ని.లకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.53 నష్టపోయి 2,722.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేరు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌(4శాతం), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(3 శాతం), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(3 శాతం), ఆంధ్రా బ్యాంకు(2శాతం), సిండికేట్‌ బ్యాంకు(1.63 శాతం) షేర్లు నష్టపోయి తాజాగా 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. గత వారంలో ఈ రంగానికి చెందిన పలు షేర్లు ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు స్వల్ప కరెక్షన్‌ ప్రారంభమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓరియంటల్‌ బ్యాంకు, అలహాదాబాద్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 4నుంచి 3శాతం నష్టపోగా, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు ఆంధ్రా బ్యాంకు షేర్లు 2శాతం పతనమయ్యాయి.  బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంకు షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

23 శాతం రాబడి కోసం 3 స్టాకులు

Monday 16th July 2018

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్స్‌ 1. అర్వింద్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 505. స్టాప్‌లాస్‌ రూ. 385. వందవారాల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయి వద్ద మద్దతు తీసుకొని పైకి ఎగిసింది. గతవారం అధోముఖ వాలురేఖను పైవైపుగా ఛేదించింది. గతంలో ఇలాంటి రివర్సల్‌ చూపినప్పుడు దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రస్తుతం టెక్నికల్‌ఇండికేటర్లన్నీ పాజిటివ్‌గా బుల్లిష్‌ మోడ్‌లో ఉన్నాయి. ఈ దఫా అప్‌మూవ్‌లో మరోమారు ఆల్‌టైమ్‌హైని తాకవచ్చని అంచనా. 2. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌

నర్నోలియా మిడ్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 16th July 2018

వచ్చే 3- 6 నెలల కాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే 5 స్టాకులను నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 179. ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం ఒక్కపెట్టున వేగంగా ఏడాది కనిష్ఠస్థాయిలకు పడిపోయింది. ఈ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు పొంది గత ఐదేళ్లుగా రూ. 200- 286 రేంజ్‌లోనే తిరుగుతోంది. ప్రస్తుతం ఈ రేంజ్‌

Most from this category