STOCKS

News


అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Wednesday 17th October 2018
Markets_main1539760097.png-21240

గత ట్రేడింగ్‌లో సూచీలను ముందుండి లాభాల నడిపించిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు​ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో దాదాపు 2శాతం పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ -0.83 శాతం నష్టపోయి 2,757 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 12 షేర్లలో ఒక్క బ్యాంక్‌(3.50శాతం లాభం) తప్ప మిగిలిన11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయింది. కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2శాతం క్షీణించాయి. వాటితో పాటు పీఎన్‌బీ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ 1శాతం పతనయ్యాయి. ఐడీబీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

ఐటీ, ఫార్మా.. మార్కెట్‌ను నడిపించలేవు!!

Wednesday 17th October 2018

టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ రంగానికి చెందిన షేర్లు ఎక్కువ కాలం బుల్‌ మార్కెట్‌ను నడిపించలేవని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు దీపన్‌ మెహ్‌తా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వారంలో చాలా కంపెనీలు వాటి ఎర్నింగ్స్‌ను ప్రకటించనున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు వాటి ఆర్థిక ఫలితాలను వెల్లడించాయని పేర్కొన్నారు. మార్కెట్‌ ఇప్పటికే బాటమ్‌కు వచ్చేసిందని, అయితే ఇక్కడ ఏ స్థాయిల్లో స్థిరపడుతుందో

200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన మెజార్టీ షేర్లు

Wednesday 17th October 2018

సూచీల్లో బలహీనతకు చిహ్నం అంటున్న నిపుణులు నిఫ్టీలో మూడింట రెండొంతుల స్టాకులు ప్రస్తుతం తమతమ 200 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువన ట్రేడవుతున్నాయి. మార్కెట్లో బేరిష్‌ ట్రెండ్‌ కొనసాగతుందనేందుకు ఇది నిదర్శనమని మోతీలాల్‌ఓస్వాల్‌ అనలిస్టు చందన్‌ తపారియా చెబుతున్నారు. మార్కెట్లు దిగువనుంచి పుల్‌బ్యాక్‌ చూపుతున్నా తిరిగి బలహీనపడే అవకాశాలే ఎక్కువన్నారు. మంగళవారానికి నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాల్లో ముగిసింది. నిఫ్టీ50లోని కంపెనీల్లో ఎల్‌అండ్‌టీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, కోటక్‌బ్యాంక్‌,

Most from this category