STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Monday 5th November 2018
Markets_main1541397901.png-21712

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ) షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. నేడు ఇండెక్స్‌ 2,930.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త వెలువడిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే 2శాతం లాభపడి 2,983.20 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గత ముగింపు గతముగింపు(2,923.15)తో పోలిస్తే 1.39శాతం లాభపడి 2,963.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 12షేర్లకు గానూ 9షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  బ్యాంకు 2శాతం లాభపడ్డాయి. ఇండియన్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడగా, సెంట్రల్‌ బ్యాంక్‌, ఐడీఐబీ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు పీఎన్‌బీ బ్యాంక్‌ 1శాతం క్షీణించగా, విజయా బ్యాంక్‌, బ్యాంక్‌ బరోడా బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. ఇదే సమయానికి ఎస్‌బీఐ బ్యాంక్‌ 2శాతం లాభంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఎస్‌బీఐ 11 నిరర్థక బ్యాంక్‌ ఆస్తుల విక్రయం ద్వారా రూ.1,019 కోట్ల సమీకరణకు సిద్ధమైందనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు.



You may be interested

నేడే ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Monday 5th November 2018

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) సోమవారం జూలై- సెప్టెంబర్‌ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ప్రస్తుత క్యూ2లో వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం సగానికిపైగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. మొండి బకాయిల కోసం అధిక కేటాయింపులు, నికర వడ్డీ ఆదాయంలో స్వల్ప వృద్ధి, తక్కువ నిర్వహణ/ఇతర ఆదాయం వంటి అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. నొమురా,

ట్యారిఫ్‌లు తగ్గిస్తామని ప్రకటించిన చైనా

Monday 5th November 2018

- స్వేచ్ఛా వాణిజ్యాన్ని మరింత వేగంగా పెంపొందిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ వ్యాఖ్య. షాంఘై: దిగుమతి సుంకాలను తగ్గిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ సోమవారం ఉదయం ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం ద్వారా తమ దేశంలో ప్రపంచ శ్రేణి వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పనున్నట్లు ఇక్కడ జరిగిన చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. విస్తృత స్థాయి మార్కెట్‌ ప్రవేశం కోసం తాము ఇప్పటికీ

Most from this category