STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019
Markets_main1562746780.png-26953

1.50శాతానికి పైగా నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 
మార్కెట్‌ పతనంతో భాగంగా ప్రభుత్వరంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదురుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఈ ఇండెక్స్‌ నేడు 3,172.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ 1.67శాతం నష్టపోయి 3099.00 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3099.00)తో పోలిస్తే 33 పాయింట్లు(1 శాతం) నష్టంతో 3,118.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ ఇండెక్స్‌ 1.50శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అరశాతం నష్టపోయింది. మరోవైపు సిండికేట్‌ బ్యాంక్‌ 2శాతం లాభపడింది. అలహదాబాద్‌ 1శాతం పెరిగింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ అరశాత నుంచి పావుశాతం లాభపడ్డాయి.  
ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 131.89 పాయింట్ల నష్టంతో 38,598.93, నిఫ్టీ 33.05 పాయింట్లను కోల్పోయి 11,522.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అధిక సర్‌చార్జీలతో 40 శాతం ఎఫ్‌పీఐలపైనే ప్రభావం!

Wednesday 10th July 2019

ఆర్థిక శాఖ విశ్లేషణ బడ్జెట్లో విధించిన అధిక సర్‌చార్జీతో ఎఫ్‌పీఐల్లో 40 శాతం మందిపై ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఈ 40 శాతం ఎఫ్‌పీలు ట్రస్ట్‌ నిర్మితిని(ట్రస్ట్‌ స్ట్రక్చర్‌) అవలంబిస్తాయని, మిగిలిన 60 శాతం మంది కార్పొరేట్‌ నిర్మితిని పాటిస్తాయని వివరించింది. ఈ 60 శాతం ఎఫ్‌పీఐలపై అధిక సర్‌చార్జీ ప్రభావం ఉండదని తెలిపింది. పైన చెప్పిన 40 శాతం ఎఫ్‌పీఐలు ఎందుకు ట్రస్ట్‌ నిర్మితిని అవలంబిస్తున్నాయి? ఇందువల్ల

ముదిరిన వివాదం..ఇండిగో 17 శాతం పతనం

Wednesday 10th July 2019

ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయింది. ఇండిగో సంస్థలో కార్పోరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవిలు జరుగుతున్నాయని గంగ్వాల్‌ సెబీకి జులై 9న లేఖ రాశారు. గంగ్వాల్‌ రాసిన లేఖకు ప్రతి

Most from this category