STOCKS

News


లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Tuesday 18th December 2018
Markets_main1545114512.png-23041

మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఇంట్రాడేలో పలు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1శాతం ర్యాలీ చేసింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకం ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ అనుసరిస్తున్న కఠినవైఖరిని సడలించడంతో పాటు, మొండి బకాయిలతో కష్టాల్లో ఉన్న బ్యాంకులకు మూలధనం కేటాయింపు ద్వారా ఉపశమనాన్ని కొత్త గవర్నర్‌ కలిగించవచ్చన్న ఆశలు ప్రభుత్వరంగ బ్యాంకులను ఊరిస్తున్నాయి. నేడు పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2,966.35ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(4 శాతం), యూనియన్‌ బ్యాంక్‌(3 శాతం), పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (2.50 శాతం)షేర్ల ర్యాలీతో పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.10శాతం లాభపడి 3,012.50ల వద్ద గరిష్టాన్ని చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 2,982.30తో పోలిస్తే 0.62శాతం లాభంతో 3000 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈలో ఎంఅండ్‌ఓ విభాగం టాప్‌ -10 గెయినర్లలో యూనియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు చోటు దక్కించుకున్నాయి.



You may be interested

ఫెడ్‌ మీటింగ్‌పై మార్కెట్‌ అంచనాలేంటి?

Tuesday 18th December 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం ప్రారంభమైంది. బుధవారం అర్ధ రాత్రి పాలసీ నిర్ణయం వెలువడనుంది. దీని ఆధారపడి సమీప కాలంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఉండొచ్చు. 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉంటుందని మార్కెట్‌ అంచనాకు వచ్చిందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌) రాజేశ్‌ పాల్వియా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడరల్‌ రిజర్వు తాజా

ఈ షేర్లలో ‘శాంతా ర్యాలీ’

Tuesday 18th December 2018

బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచిన ఎంఏసీడీ ఇండికేటర్‌ మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజా పరుగు  చూస్తుంటే సూచీల్లో శాంతా ర్యాలీ ఆరంభమైనట్లుందని అంచనా వేస్తున్నారు. సోమవారం ముగింపు ప్రకారం 121 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో వొడాఫోన్‌ ఐడియా,

Most from this category