STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 5th March 2019
Markets_main1551768883.png-24438

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలకు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ అండగా నిలుస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,826ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐడీబీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) బ్యాంక్‌ షేరు 6శాతం లాభపడింది. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ 3.50శాతం పెరిగాయి. అలాగే ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 3శాతం ర్యాలీ చేయగా, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ 2శాతం లాభపడ్డాయి. అలాగే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు సైతం 1.50శాతం ఎగిసింది. ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2.50శాతం లాభపడి 2901 గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (2,832.00)తో పోలిస్తే 2.20శాతం లాభంతో 2,897 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

టాటా మోటర్స్‌ జూమ్‌

Tuesday 5th March 2019

టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం 10శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన అనుబంధ కంపెనీ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమెరికా మార్కెట్లో ఫిబ్రవరి వాహన విక్రయ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. జాగ్వర్‌ విభాగపు అమ్మకాల్లో 59శాతం వృద్ధిని, లాండ్‌ రోవర్‌ విభాగంలో 19శాతం వృద్ధిని సాధించాయి. ట్రేడ్‌వార్‌ కారణంగా గత కొంతకాలంగా అమ్మకాలు నిరాశజనకంగా ఉన్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి

సీపీఎస్‌ఈల అసెట్స్‌ విక్రయానికి ప్రత్యేక విభాగం

Tuesday 5th March 2019

సీపీఎస్‌ఈల అసెట్స్‌ విక్రయానికి ప్రత్యేక విభాగం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) ప్రాధాన్యేతర ఆస్తుల్ని విక్రయించే ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తోంది. అసెట్ మానిటైజేషన్ సెల్‌ పేరిట ఏర్పాటయ్యే ఈ విభాగం... అటు శతృ ఆస్తుల విక్రయానికి (భారత్ నుంచి పాకిస్తాన్‌, చైనాకి వలసపోయిన వారు) సంబంధించిన కేసులను కూడా పర్యవేక్షిస్తుంది. "సీపీఎస్‌ఈల ప్రాధాన్యేతర అసెట్స్ విక్రయ

Most from this category