News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Thursday 7th March 2019
Markets_main1551941302.png-24470

లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.25శాతం పెరిగి 2,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 4.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ అత్యధికంగా 4.50 నష్టపోగా, ఐడీబీఐ బ్యాంక్‌ 1.50శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే నిఫ్టీ ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి లాభ, నష్టాల మధ్య ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ ఇండెక్స్‌ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,050 వద్ద, సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 36,656 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతుండగా, ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Thursday 7th March 2019

స్తబ్దుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఇంట్రాడేలో ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3021.30)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టంతో 3,000.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వేదాంత, నాల్కో షేర్లు 1.50శాతం

స్టార్టప్‌ల పన్ను మినహాయింపుపై సీబీడీటీ నోటిఫికేషన్‌

Thursday 7th March 2019

స్టార్టప్‌ల పన్ను మినహాయింపుపై సీబీడీటీ నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో పెట్టే రూ.25 కోట్ల పెట్టుబడులకు ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపునకు సంబంధించి సవరించిన నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నోటిఫై చేసింది. స్టార్టప్‌లకు సంబంధించి సవరించిన నిబంధనలను పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి తెచ్చినట్టు పేర్కొంది. ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపును పెంచాలని స్టార్టప్‌లు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.25

Most from this category