STOCKS

News


భారీ లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Tuesday 19th March 2019
Markets_main1552990989.png-24694

వరుసగా మూడో రోజూ ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ కొనసాగింది. బ్రోకరేజ్‌ సం‍స్థలు ఈ రంగ బ్యాంకులపై రేటింగ్‌ పెంచడం కలిసొచ్చింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన కేటాయింపుతో కొంతమేర ఉపశమనం కలుగుతుందనే అంచనాలతో ఆయా బ్యాంకులకు బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను పెంచాయి. ఇక్రా రేటింగ్‌ సంస్థ బ్యాంకు ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఓబీసీలకు గతంలో తాము కేటాయించిన నెగిటివ్‌ రేటింగ్‌ను స్థిరత్వంగా సవరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మూడీస్‌ సంస్థ సైతం ధీర్ఘకాలికంలో విదేశీ డిపాజిట్స్‌ పెరగవచ్చనే అంచనాలతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుల రేటింగ్‌ బీఎ2నుంచి బీఎ3కు పెంచింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో నేడు ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌, పీఎన్‌బీ, ఓబీసీ, బీవోబీ, సెంట్రల్‌, కెనరా, ఇండియన్‌, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌లు 7-2 శాతం మధ్య లాభపడ్డాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేరు ఏడాది గరిష్టాన్ని  చేరుకోగా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 7నెలల గరిష్టాన్ని చేరుకుంది.



You may be interested

11500 పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 19th March 2019

ముంబై:- మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడం సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 11,532 వద్ద, సెన్సెక్స్‌ 268 పాయింట్లు పెరిగి 38,363 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేశాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 29,768 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలు,

అర్ధంపర్ధం లేని వాల్యూషన్లు!

Tuesday 19th March 2019

మార్కెట్‌పై కోటక్‌ ఈక్విటీస్‌ అభిప్రాయం ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది ఆలోచనకు భిన్నమైన ఆలోచనను కోటక్‌ ఈక్విటీస్‌ వెలువరించింది. ప్రస్తుత మార్కెట్లో వాల్యూషన్లు అర్ధరహితంగా ఉన్నాయని, చాలా విభాగాలు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. అందువల్ల వీలయినంతవరకు బలహీనమైన రంగాలు, అధిక వాల్యూషన్లు ఉన్న రంగాలు, స్టాకుల నుంచి వైదొలుగుతున్నామని కోటక్‌ వెల్లడించింది. మార్చి ఆరంభంలో స్టార్టయిన తాజా ర్యాలీలో అనేక స్టాకులు పాలుపంచుకుంటున్నాయి. కానీ కొన్ని ఫైనాన్షియల్‌

Most from this category