STOCKS

News


పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల పరుగు

Tuesday 16th October 2018
Markets_main1539681942.png-21206

  • 3శాతం ర్యాలీ చేసిన ఎస్‌బీఐ షేరు

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లు ర్యాలీ సూచీలను ముందుండి నడిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ సూచీ ఇంట్రాడేలో 3శాతం లాభపడి 2,783.90 వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం గం.2.00లకు ఇండెక్స్‌ 2.50శాతం లాభపడి 2,775.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 12 షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంకు, బ్యాంక్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ షేర్లు 4నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. అలాగే ఓరియంటల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, విజయాబ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. ఐడీబీఐ బ్యాంకు అరశాతం లాభపడింది. ఈ సూచీలో భాగమైన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు 3శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో చోటు దక్కించుకుంది.



You may be interested

రూ.20,000 కోట్ల బైబ్యాక్‌ చేయండి!!

Tuesday 16th October 2018

ఆయిల్‌ కంపెనీలను కోరిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీల్లో తనకున్న వాటాలు విక్రయించి నిధుల సమీకరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.20,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ చేయాలని ఆయిల్‌ కంపెనీలకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు ఇంధన ధరల నిర్ణయంలో కలుగజేసుకోమంటూ ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వ ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో పెట్రో, ఆయిల్‌ కంపెనీలు...ప్రభుత్వం వద్దనున్న వాటాను బైబ్యాక్‌ చేయడం

ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Tuesday 16th October 2018

మంగళవారం మార్కెట్‌ అనంతరం ఇన్ఫోసిస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించనుంది. మంచి వృద్ది, మార్జిన్ల విస్తరణ.. ఈ దఫా ఫలితాల్లో ఉండొచ్చని ఎక్కువమంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. పనయా డౌన్‌గ్రేడ్‌కు సంబంధించిన నష్టాలు ముగిసిపోవడంతో కలిసివస్తుందని భావిస్తున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎమ్‌కే గ్లోబల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ లాంటి ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనా ప్రకారం కంపెనీ నికరలాభం ఈ దఫా 3880- 4150 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చు. స్థిర కరెన్సీ వృద్ధి

Most from this category