STOCKS

News


రక్షణాత్మక ధోరణి అవసరం, సాహసోపేత నిర్ణయాలు వద్దు..!

Wednesday 5th December 2018
Markets_main1544005731.png-22670

  • బసంత్ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ సూచన

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రస్తుతం మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను నిర్వహిస్తున్నారని ప్రముఖ మనీ మేనేజర్ బసంత్ మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఇన్వెస్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కంటే రక్షణాత్మక ధోరణిని అవలంభించడం మంచిదని సూచించారు. గడిచిన 45- 60 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం వ్యక్తమవుతుందన్నారు. అక్టోబర్‌ వంటి పరిస్థితులు ఎదురుకావచ్చని తాను చెప్పడం లేదని.. అయితే, వచ్చే 4- 5 నెలల్లో మాత్రం గడ్డుపరిస్థితులు తప్పవని అంచనావేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మార్కెట్‌ సవాళ్లను ఎదుర్కోక తప్పదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంటే తప్పించి మన మార్కెట్‌కు నిధులు వచ్చే ఇతర మార్గం లేదన్నారు. యూఎస్‌ బాగుంటేనే భారత మార్కెట్లకు విదేశీ నిధులు అందుతాయని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మన దేశంలో కేవలం 15-30 కంపెనీల ఫండమెంటల్స్‌ మాత్రమే చాలా బలంగా ఉండగా.. వీటి వృద్ధి 25-30 శాతం వరకు ఉండవచ్చని అయితే ఇవి ఏమంత చౌకగా లేవని వివరించారు. 2019 ఎన్నికల అంశానికి మార్కెట్‌ సిద్ధంగానే ఉండగా.. ఎఫ్‌ఎంసీజీ రంగంలో హిందూస్తాన్ యునిలివర్ వంటి బలమైన షేర్లు జీవితకాల గరిష్టస్థాయిని నమోదుచేస్తున్నాయి. ఈ షేరుపై బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపారు. ట్రేడర్లు అయితే ఇప్పటికీ హెచ్‌యూఎల్‌ నుంచి లాభాలను పొందవచ్చని, ఇన్వెస్టర్లు మాత్రం ఇదే తరహా వ్యాపారంలో ఉన్నటువంటి మరో కంపెనీ షేరును చూడమని సూచించారు. బ్యాంకింగ్‌ రంగపై బుల్లిష్‌గా ఉండవచ్చని సూచించిన ఆయన.. అన్ని ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లను కొనుగోలు చేయవల్సిన అవసరం లేదన్నారు. తాము పీఎన్‌బీ హౌసింగ్‌ను ఐపీఓ సమయం నుంచి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తానైతే కనీసం 30 శాతం రాబడిని ఇవ్వగలిగిన షేర్లను మాత్రమే చూస్తానని చెప్పారు. పేజ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొదట్లో తనకు ఈ తరహా రాబడిని ఇవ్వగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 శాతం రాబడికి మాత్రమే అవకాశం ఉండడం వల్ల వీటిని మళ్లీ కొనేది లేదన్నారు. ఒకప్పుడు 40 శాతం రాబడి ఇచ్చి ఆ తరువాత 10 శాతానికి మాత్రమే పరిమితమయ్యే వాటిని కూడా చూసేది లేదని, ఈ తరహా రంగంలో ఇన్‌ఫ్రా ఉన్నట్లు తెలిపారు.You may be interested

హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ ధర రూ.2,160..!

Wednesday 5th December 2018

ముంబై: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) షేరు ధర బుధవారం ఒకదశలో రూ.1,854.80 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.44 (2.45 శాతం) లాభపడి రూ.1,852 వద్ద ముగిసింది. ఈ షేరుకు ఫిలిప్స్‌ కాపిటల్‌ (ఇండియా) బై కాల్‌ ఇచ్చింది. రూ.2,160 టార్గెట్‌ ధరను ప్రకటించింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) డీల్‌ ప్రకటన అనంతరం టార్గెట్‌ ధరను సవరించినట్లు తెలిపింది. 2021 ఆర్థిక

మరో నష్టాల ముగింపు.!

Wednesday 5th December 2018

ప్రపంచ మార్కెట్ల క్షీణత, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 250 పాయింట్లు నష్టపోయి 35,884 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 10,785 వద్ద ముగిశాయి. నష్టాల ముగింపు వరుసగా ఇది రెండో రోజు.  ప్రపంచమార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు, రూపాయి నష్టాల ట్రేడింగ్‌తో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన మార్కెట్‌ వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో మిడ్‌సెషన్‌ సమయాని కల్లా సెన్సెక్స్‌ 36వేల

Most from this category