STOCKS

News


74 కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల వాటా

Saturday 3rd November 2018
Markets_main1541183546.png-21674

మార్కెట్లు భారీగా పతనం కావడం, కొన్ని స్టాక్స్‌ అయితే, కకావికలం కావడం ఇన్వెస్టర్లు గడిచిన రెండు నెలల కాలంలో చూసి ఉంటారు. కానీ, ప్రమోటర్లు మాత్రం దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సెప్టెంబర్‌ త్రైమాసికంలో తమ కంపెనీల్లో స్వల్పంగా వాటాలు పెంచుకున్నారు. బీఎస్‌ఈ 500 సూచీలోని కంపెనీల్లో 74 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. 2018లో ఇప్పటి వరకు ఈ కంపెనీల షేర్ల ధరలు 80 శాతం వరకూ క్షీణించడం గమనార్హం. 

 

వాటా పెరిగిన కంపెనీలు
మన్‌పసంద్‌ బెవరేజెస్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, సద్భావ్‌ ఇంజనీరింగ్‌, డీబీ కార్ప్‌, ఇండియా సిమెంట్స్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, డిష్‌ టీవీ, జీఐసీ హౌసింగ్‌, ఎన్‌సీసీ, జైన్‌ ఇరిగేషన్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌, సియట్‌, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌, మనప్పురం ఫైనాన్స్‌, జాగరణ్‌ ప్రకాశన్‌, లారస్‌ ల్యాబ్స్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అశోక బిల్డ్‌కాన్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. 

 

ప్రమోటర్ల వాటా తగ్గినవి...
బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ పరిధిలో 87 ‍కంపెనీల్లో ప్రమోటర్ల వాటాలు తగ్గాయి. ఈ జాబితాలో 8కే మైల్స్‌, సైయంట్‌, అజంతా ఫార్మా, యాక్సిస్‌ బ్యాంకు, అవంతి ఫీడ్స్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, డీఎల్‌ఎఫ్‌, ఐచర్‌ మోటార్స్‌, కోటక్‌ బ్యాంకు, జస్ట్‌ డయల్‌, ఎంఅండ్‌ఎం, మైండ్‌ట్రీ, నాట్కో ఫార్మా, ఎన్‌ఐఐటీ టెక్‌, యస్‌ బ్యాంకు, వోకార్డ్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

 

వాటాలు ఎందుకు పెంచుకోవడం?
ప్రమోటర్ల వాటాలు పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. వాస్తవ విలువ కంటే షేరు విలువ తక్కువగా ఉందని ప్రమోటర్లు భావిస్తే ఓపెన్‌ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.  ఇలా వాటాలు పెంచుకున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు, ఆ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వం, ఆదాయాల వృద్ధి అవకాశాలు, రుణాలు ఏ మేరకు ఉన్నాయి, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ తదితర అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. ‘‘ప్రమోటర్ల వాటా పెరగడం వెనుక కారణం వేరే అయి ఉండొచ్చు. వ్యాపార విలువ లేదా భవిష్యత్తులో టర్న్‌ అరౌండ్‌ అయ్యే అవకాశాలను వారు గుర్తించొచ్చు. తమ కంపెనీని మరో కంపెనీ సొంతం చేసుకోకుండా కూడా ఇలా చేయవచ్చు’’ అని 5నాన్స్‌కు చెందిన దినేష్‌ రోహిరా తెలిపారు.You may be interested

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 3rd November 2018

6.6 శాతం పతనమైన ఆపిల్‌ షేరు న్యూయార్క్: అమెరికా స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం యూఎస్‌ సూచీలు అర శాతం మేర నష్టాలను నమోదుచేశాయి. ఆపిల్ ఇంక్ షేరు ధర 6.6 శాతం పతనం కావడమే ఇందుకు ప్రధాన కారణం కాగా, చైనా వాణిజ్య అంశంపై నెలకొన్న అనిశ్చితి సూచీలను నష్టాల బాట పట్టించింది. డోజోన్స్‌ 0.43 శాతం నష్టపోగా.. నాస్‌డాక్‌ 1.04 శాతం,

మాస్టర్‌కార్డ్‌కు నిద్ర లేకుండా చేస్తున్న ‘రూపే కార్డ్‌’ 

Friday 2nd November 2018

మీ దగ్గరో, లేక మీ కుంటుంబ సభ్యుల్లో ఒక్కరి దగ్గరయినా మాస్టర్‌కార్డ్‌ ఉండే ఉంటుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ మన దేశంలో మొన్నటి వరకు బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో సింహ భాగం వాటాతో ప్రతీ లావాదేవీపై కమీషన్‌ ఆర్జిస్తూ బాగానే ఆర్జించింది. కానీ, మోదీ సర్కారు తీసుకొచ్చిన స్వదేశీ ‘రూపే కార్డ్‌’ ఇప్పుడు మాస్టర్‌ కార్డుకు నిద్ర లేకుండా చేస్తోంది. రూపే కార్డ్‌ను వినియోగించడం ద్వారా స్వదేశీ

Most from this category