STOCKS

News


ప్రమోటర్ల తాకట్టు వ్యాపారం!

Saturday 23rd February 2019
Markets_main1550862106.png-24285

డిసెంబర్‌ త్రైమాసికంలో పలు కంపెనీల ప్రమోటర్లు తమ వాటాల తనఖాను పెంచితే, కొన్ని కంపెనీల ప్రమోటర్లు తనఖా మొత్తాన్ని తగ్గించుకున్నారు. బీఎస్‌ఈ-500లోని స్టాక్స్‌ గణాంకాల ఆధారంగా కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికను రూపొందించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ‍ప్రమోటర్ల తాకట్టు వాటాల పరిమాణం డిసెంబర్‌ క్వార్టర్లో స్థిరంగా ఉంది. ప్రమోటర్ల తాకట్టు వాటాలు 6.7 శాతంగా ఉన్నాయి. తాకట్టు వాటాల విలువ రూ.1.96 లక్షల కోట్లు. 116 కంపెనీల ప్రమోటర్ల వాటాలు తనఖాలో ఉన్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వీటి సంఖ్య 114 కంటే రెండు పెరిగాయి. ఆరు కంపెనీల్లో అయితే ప్రమోటర్లు 90 శాతానికి పైగా తమ వాటాలను తాకట్టు పెట్టి రుణాలు తీసేసుకున్నారు. అయితే, తాకట్టు పెట్టినంత మాత్రాన ఆయా కంపెనీలు, ప్రమోటర్లు ఆర్థిక సమస్యల్లో ఉన్నట్టు కాదని కోటక్‌ పేర్కొంది. బ్యాంకులు ప్రమోటర్ల వాటాల రూపంలో అదనపు హామీని కోరతాయని తెలిపింది. ఈ నివేదిక సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రమోటర్ల తాకట్టు వాటాల పరంగా మార్పులపై దృష్టి సారించింది. డిసెంబర్‌ త్రైమాసికం తర్వాత తనఖా వివరాలు ఇందులో లేవు.

 

ప్రధాన అంశాలు...

  • 95 శాతానికి పైగా ప్రమోటర్ల వాటా తనఖాలో ఉన్నవి... సీజీ వపర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌, క్వాలిటీ, రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌.
  • ప్రమోటర్ల తనఖా వాటాలు పెరిగినవి... ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌. 
  • తాకట్టు వాటాలు తగ్గిన కంపెనీలు... ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి.
  • తాజాగా ప్రమోటర్లు తనఖా పెట్టినవి... టెక్స్‌మాకో రైల్‌, యూఫ్లెక్స్‌, వోకార్డ్‌.
  • తనఖాలో ఉన్న వాటాలను విడిపించుకున్న ప్రమోటర్ల కంపెనీల్లో... సోనాటా సాఫ్ట్‌వేర్‌.
  • నిఫ్టీ-50లోని కంపెనీల్లో 5 శాతానికి పైగా వాటాలు తనఖాల్లో ఉన్నవి... జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (59.4శాతం), అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ (45.5శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (43.6శాతం), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (26.4శాతం), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (12.7శాతం).



You may be interested

బ్యాంకుల మధ్య అంతర్గత ఒప్పందాలకు కదలిక

Saturday 23rd February 2019

వేగవంతం కానున్న పలు ఎన్‌పీఏల పరిష్కారం  జీఎంఆర్‌ చత్తీస్‌గఢ్‌, హెచ్‌సీసీ కేసుల్లో అమలు న్యూఢిల్లీ: బ్యాంకులు ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకునే కసరత్తులో భాగంగా తమ మధ్య కుదిరిన ఒప్పందాల (ఇంటర్‌ క్రెడిటర్‌ అగ్రిమెంట్‌/ఐసీఏ)ను అమల్లోకి తీసుకురానున్నాయి. తద్వారా మధ్య స్థాయి ఎన్‌పీఏ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నాయి.  ఏడు నెలల క్రితం బ్యాంకులు అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ప్రకారం మైనారిటీ రుణదాతలు మెజారిటీ రుణదాతల నిర్ణయాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందుస్తాన్‌

స్మాల్‌క్యాప్‌లో ఒక వంతు కంటే ఎక్కువొద్దు!

Saturday 23rd February 2019

స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఒక వంతు కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం సూచనీయం కాదని హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఐవో ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. ముంబైలో  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాధారణ ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై సూచనలు చేశారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో పావు శాతం లేదా ఒక వంతు (33 శాతం) వరకు స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెట్టబడులు పెట్టుకోవచ్చన్నారు. ప్రతీ రంగంలో పెద్ద కంపెనీలు

Most from this category