STOCKS

News


రూ.2.14 లక్షల కోట్ల షేర్లు తనఖాలోనే!!

Thursday 9th August 2018
Markets_main1533791647.png-19068

న్యూఢిల్లీ: బీఎస్‌ఈలో లిస్టైయిన కంపెనీలలోని ప్రమోటర్ల తనఖా షేర్ల విలువ జూలై చివరినాటికి రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుని 14.60 శాతం పెరుగుదలను నమోదుచేసినట్లు ఎక్స్ఛేంజ్‌ సమాచారంలో వెల్లడయింది. జూన్‌ 30 నాటికి ఈ మొత్తం రూ.2.14 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో 400 వరకు కంపెనీల ప్రమోటర్లు 30 శాతానికి మించి తమ వాటాలను తనఖా పెట్టినట్లు వెల్లడి కాగా, ఈ మొత్తం విలువ రూ.1.29 లక్షల కోట్లుగా ఉంది. 30-50 శాతం వరకు వాటాలను తనఖా పెట్టిన ప్రమోటర్ల షేర్ల విలువ రూ.44,409 కోట్లని వెల్లడయింది. ఇక 50-70 శాతం వరకు తనఖా పెట్టిన ప్రమోటర్ల జాబితాలో 78 కంపెనీలు ఉండగా, ఈ విలువ రూ.29,853 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 75-90 శాతం వరకు తనఖా పెట్టిన ప్రమోటర్ల కంపెనీలు 3 ఉండగా.. ఈ మొత్తం విలువ రూ.85 కోట్లుగా ఉంది. 



You may be interested

అదిరిపోయే ఫోటోలకు ‘ఎంఐ ఏ2’

Thursday 9th August 2018

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ ఏ2 ‘ఆండ్రాయిడ్‌ వన్’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత్‌లో విడుదలచేసింది. ఫోటోగ్రఫీ సామర్థ్య పెంపు ఈ ఫోన్‌లో అదనపు ఆకర్షణగా ఉందని సంస్థ ఎండీ, వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ జైన్‌ తెలిపారు. వెనుక వైపు 12 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌ రేర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ డ్యుయల్‌ కెమెరాలు కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌.. ముందుభాగంలో 20ఎంపీ కెమెరాను కలిగిఉందని ఆయన వివరించారు.

పాత కార్యాలయం అమ్మకంపై పీఎన్‌బీ కసరత్తు

Thursday 9th August 2018

ముంబై: నష్టాలు, మొండిబాకీల భారం నుంచి కోలుకునే దిశగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లోని తమ పాత ప్రధాన కార్యాలయ భవంతిని విక్రయించడంపై కసరత్తు చేస్తోంది. ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సయిజ్ వంటి పలు ప్రభుత్వ విభాగాలతో చర్చలు జరుపుతోంది. భారీ డిమాండ్ నెలకొనడంతో ప్రాపర్టీ విలువను రెండోసారి మదింపు చేస్తున్నట్లు పీఎన్‌బీ ఎండీ

Most from this category