STOCKS

News


ఈ కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల తనఖా

Friday 10th May 2019
Markets_main1557511429.png-25668

బీఎస్‌ఈ-500 కంపెనీల ప్రమోటర్ల తనఖా వాటాలు డిసెంబర్‌ నాటితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో కొంత తగ్గాయి. బీఎస్‌ఈ 500 కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల వాటాల తనఖా డిసెంబర్‌ నాటికి 2.98 శాతంగా ఉండగా, మార్చి క్వార్టర్‌లో 2.83 శాతానికి తగ్గింది. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక ప్రకారం ప్రమోటర్లు తనఖాలో ఉంచిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. అయితే, వీటిల్లో ఓ 30 కంపెనీలకు సంబంధించి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వీటిల్లో ప్రమోటర్ల తనఖా మొత్తం డిసెంబర్‌ క్వార్టర్‌తో పోలిస్తే పెరిగినట్టు కోటక్‌ నివేదిక తెలిపిపింది.

 

ప్రమోటర్లు రుణాల కోసం హామీగా కంపెనీలో తమకున్న వాటాలను తనఖాలో ఉంచడం చేస్తుంటారు. కంపెనీ వ్యాపార అవసరాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసమైనా రుణాలు తీసుకొని ఉండొచ్చు. ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిష్‌టీవీ షేర్లు ఈ నెల 7వ తేదీన 5-9 శాతం మధ్య పడిపోయాయి. ‘‘ఎస్సెల్‌ గ్రూపు స్టాక్స్‌ల్లో ప్రమోటర్లకు చెందిన అధిక శాతం వాటాలు తనఖాలోకి వెళ్లాయి. అందుకే వాటి ధరలు తగ్గాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. ప్రమోటర్లకు చెందిన అధిక శాతం వాటాలు తనఖాలో ఉంచితే అది చాలా రిస్క్‌ అని, ముఖ్యంగా లిక్విడిటీ కఠినంగా మారిన పరిస్థితుల్లో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పారు. కనుక ఇన్వెస్టర్లు ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులకు ముందు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

 

బీఎస్‌ఈ 500లో ప్రమోటర్లు తనఖా వాటాలు పెరిగిన కంపెనీల్లో జేకే టైర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, డిష్‌ టీవీ, వీఏ టెక్‌ వాబాగ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, పరాగ్‌ మిల్క్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, మ్యాక్స్‌ ఇండియా, సన్‌ఫార్మా, సెంట్రమ్‌ క్యాపిటల్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, హిమాత్‌సింగా సీడ్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, నోసిల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, అపోలో హాస్పిటల్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు తదితర కంపెనీలు ఉన్నాయి. బీఎస్‌ఈ-500లో మొత్తం 116 కంపెనీల ప్రమోటర్లు తనఖా మార్గాన్ని ఆశ్రయించారు. 90 శాతానికి పైగా తమ వాటాలను తనఖా ఉంచిన కంపెనీల్లో సీజీ వపర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, డిష్‌ టీవీ, గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి.
 



You may be interested

‍నిఫ్టీ ప్యాక్‌లో ఇవి చౌకగా..!

Friday 10th May 2019

నిఫ్టీ-50 ఇటీవల రికార్డు గరిష్ట స్థాయి 11,856 వరకు వెళ్లింది. అప్పటి నుంచి దిద్దుబాటులోకి వెళ్లింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తుండడంతో సూచీల ర్యాలీ రివర్స్‌ అయింది. గరిష్ట స్థాయిల నుంచి ఇండెక్స్‌ ఇప్పటికే 5 శాతం దిద్దుబాటుకు గరైంది. ఐదు రోజులు, 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను కూడా ఇండెక్స్‌ బ్రేక్‌ చేఇంది. అమ్మకాలు ఎక్కువగా లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే, ఇప్పటికీ నిఫ్టీ-50లో

11300 దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 10th May 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలనే చవిచూసింది. మెటల్‌, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,462 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11,300ల దిగువున 11,279 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా ఎనిమిది రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఈ ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్‌ 1603 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 488 పాయింట్లను నష్టపోయింది. అమెరికా-చైనాల మద్య

Most from this category