STOCKS

News


ఈ ప్రమోటర్లకు తమ షేర్లపై నమ్మకమెక్కువ!

Saturday 29th September 2018
Markets_main1538160368.png-20684

ప్రమోటర్లు తమ కంపెనీ స్టాక్స్‌ను స్వయంగా కొనుగోలు చేశారంటే...? అది భవిష్యత్తు వృద్ధిపై నమ్మకానికి నిదర్శనంగానే చూస్తారు మార్కెట్‌ నిపుణులు. ఇటీవలి కాలంలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో పేరున్న కంపెనీల షేర్లు సైతం ఎవరూ ఊహించని కనిష్ట ధరలకు పడిపోయాయి. ఆర్థిక ప్రతికూల అంశాల మధ్య ఒక విధమైన విచక్షణారహిత అమ్మకాల ఒరవడితోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితితో చాలా ఆకర్షణీయమైన విలువలకు చాలా షేర్లు దిగొచ్చాయి. కొన్ని మల్టీ ఇయర్‌ కనిష్ట స్థాయిలకు చేరాయి. అందుకునేమో ఆయా కంపెనీల ప్రమోటర్లు కొనుగోళ్ల వేటలో పడినట్టున్నారు.

 

బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 1,10,700 షేర్లను (రూ.34.8 కోట్లు) శేఖర్‌, నీరజ్‌ బజాజ్‌ కొన్నారు. ఎవరెడీ ఇండస్ట్రీస్‌ 2 లక్షల షేర్లను విలియమ్‌సన్‌ మాగోర్‌ అండ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. మారికో ప్రమోటర్‌ హర్ష్‌ మారివాలా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ షేర్లు 1.3 లక్షలను కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో మారివాలా డైరెక్టర్‌గా ఉన్నారు. ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేరు ఏడాది గరిష్ట స్థాయి నుంచి 50 శాతానికి పైగా పడింది. అందుకేనేమో ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ ఎంప్లాయీస్‌ వెల్‌ఫేర్‌ ట్రస్ట్‌ 2 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీకి సంబంధించిన వారు ఆ కంపెనీ షేర్లను కొన్నారంటే తక్కువ విలువలకు చేరాయని లేదా ఇంకా వృద్ధికి ఎంతో అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రమోటర్లు, కంపెనీతో సంబంధం ఉన్నవారు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో... చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్ఫిబీమ్‌ అవెన్యూస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, డిష్‌ టీవీ, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్‌, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అపోలో టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, అసాహి ఇండియా గ్లాస్‌, అశోక బిల్డ్‌కాన్‌, ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ ఉన్నాయి. You may be interested

రెండు లాభాల్లో.. ఒకటి నష్టాల్లో

Saturday 29th September 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత భయాలు మార్కెట్‌ లాభాలను పరిమితం

నిలిచిపోయిన జెబ్‌పే సేవలు

Saturday 29th September 2018

ఎట్టకేలకు దేశీయ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ జెబ్‌పే తన సేవల్ని నిలిపివేసింది. ట్రేడింగ్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఎక్సేంజ్‌కు సంబంధించి అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నామని, పూర్తి కాని అన్ని ఆర్డర్లు రద్దవుతాయని, ఆయా ఫండ్స్‌ను కస్టమర్ల జెబ్‌పే వ్యాలెట్లకు క్రెడిట్‌ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది.    బ్యాంకు అకౌంట్లపై నియంత్రణలతో తమ, తమ కస్టమర్ల వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని కట్టేసినట్టయిందని

Most from this category