STOCKS

News


ప్రమోటర్లు వాటాలను పెంచుకున్న కంపెనీలివే..!

Friday 26th October 2018
Markets_main1540550919.png-21495

మార్కెట్‌ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టులాడుతోంది. షేర్లు ఎప్పటికప్పుడు కొత్త కనిష్టాలను తాకుతూ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో అనూహ్యంగా కొన్ని కంపెనీల ప్రమోటర్లు సంస్థలో తమ వాటాలను పెంచుకుంటున్నారు. వ్యాపార విస్తరణ, అభివృద్ధికి తీసుకోబోతున్న కంపెనీ తీసుకోబోతున్న నిర్ణయాలు ప్రమోటర్లకు తెలియడం, కంపెనీ షేరుకు ఉన్న వాల్యూను వారు గుర్తించటం, కంపెనీ మెజార్టీ వాటాను తమ గుప్పిట్లో ఉంచుకోవడం వంటి కారణాలతో ప్రమోటర్లు కంపెనీల్లో తమ వాటాలను పెంచుకుంటారు.
ప్రమోటర్లు వాటా పెంచుకున్న కంపెనీలివే..!
ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వోడాఫోన్‌ ఐడియా, డిష్‌ టీవీ, హాత్‌వే కేబుల్స్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌, డీసీఎం శ్రీరాం ఇండస్ట్రీస్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌, మెక్‌లాయిక్‌ రస్సెల్‌, హాట్సన్‌ ఆగ్రో, మోనోస్పాట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, తదితర కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు.

  • అటో, అటో విడిబాగాల కంపెనీలైన టాటామోటర్స్‌, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ సీట్స్‌, జేఎంటీ అటో తదితర కంపెనీలో ప్రమోటర్లు వాటాను పెంచుకున్నారు.
  • రసాయన కంపెనీలైన అతుల్‌ లిమిట్‌, ధనూశ్రీ పెట్రోకెమ్‌, బాలాజీ అమైన్స్‌, జ్యోతి రిసైన్స్‌ తదితర కంపెనీలో ప్రమోటర్ల వాటా పెరిగింది.

మొన్నత్ఇ‌స్పాత్‌:- గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపు నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 25.27 శాతం ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాకం నాటికి ప్రమోటర్ల వాటా 74.37శాతానికి పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వోడాఫోన్‌ ఇండియా:- గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాకం ముగింపు నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 42.56శాతం ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపు సెప్టెంబర్‌ 30 నాటికి ప్రమోటర్ల వాటా 71.33 శాతానికి పెరిగింది.
అతుల్‌ లిమిటెడ్‌:- గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాకం ముగింపు నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 44.65శాతం ఉంది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాకం ముగింపు సెప్టెంబర్‌ 30 నాటికి ప్రమోటర్ల తమ వాటాలను 44.67 శాతానికి పెంచుకున్నారు.



You may be interested

ప్రపంచ మార్కెట్లకు అమెజాన్, గూగుల్‌ దెబ్బ

Friday 26th October 2018

అమెజాన్, అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ) సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు....మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆసియా మార్కెట్లలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ షేర్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌లో గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రధాన యూరప్‌ సూచీలు జర్మనీ డాక్స్, ఫ్రాన్స్‌ కాక్, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈలు 1.5–2 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. భారత్‌లోని సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్న

ఫలితాల తర్వాత ఈ షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Friday 26th October 2018

తాజా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించిన వివిధ కంపెనీలకు చెందిన షేర్లను మధ్య, దీర్ఘకాలానికి కొని, హోల్డ్‌చేయదగ్గ షేర్లను బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేసాయి. అవి... కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ బ్రోకరేజ్‌: సీఎల్‌ఎస్‌ఏ. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 1420 ఫలితాల అనంతరం కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ రేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ ‘అవుట్‌పెర్ఫార్మ్‌’ నుంచి ‘బై’కి రేటింగ్‌ను సవరించింది. అయితే ఏడాది కాలానికి టార్గెట్‌ ధరను రూ. 1480 నుంచి రూ. 1420కి తగ్గించింది. ఈ బ్యాంకు

Most from this category