STOCKS

News


తక్కువ ధరల వద్ద ప్రమోటర్ల కొనుగోళ్లు

Friday 22nd February 2019
Markets_main1550774322.png-24270

మార్కెట్‌ పరిణామాలతో కొన్ని స్టాక్స్‌ దారుణంగా పడిపోవడం ఆయా కంపెనీల ప్రమోటర్లను ఆలోచింపజేసింది. దీంతో తక్కువ ధరల వద్ద తమ కంపెనీల్లో వాటాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారు. ఆ వివరాలను గమనిస్తే... 

 

జనవరి 1 నుంచి సుమారు 150 కంపెనీల ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు లేదా బైబ్యాక్‌, ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా వాటాలు పెంచుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు టాటా మోటార్స్‌ షేర్లు ఇటీవలి కొన్నేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా ప్రమోటింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ భావించింది. దీంతో 1.18 కోట్ల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా గత వారం కొనుగోలు చేసింది. దీని విలువ రూ.183 కోట్లు. ముఖ్యంగా జేఎల్‌ఆర్‌ కారణంగా టాటా మోటార్స్‌ డిసెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. షేరు ధర పడిపోవడానికి కారణం ఇదే. 52 వారాల గరిష్ట స్థాయి నుంచి స్టాక్‌ ధర 56 శాతం పడిపోయింది. ప్రమోటర్ల కొనుగోళ్ల మద్దతుతో గత వారంలో కొంత రివకరీ కూడా అయింది. ఇక బజాజ్‌ ఆటోలో రూ.600 కోట్ల విలువైన వాటాలను బజాజ్‌ హోల్డింగ్స్‌ జనవరి 1 తర్వాత కొనుగోలు చేసింది. అదే సమయంలో బజాజ్‌ ఫైనాన్స్‌లో రూ.367 కోట్ల విలువైన వాటాలను బజాజ్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేయడం గమనార్హం. ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో ప్రమోటర్లు కిషోర్‌ బియానీ కుటుంబం రూ.107 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఏడాది గరిష్ట స్థాయి నుంచి ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు 37 శాతం తగ్గడంతో ప్రమోటర్లు అదనంగా కొనుగోలు చేయడం గమనార్హం. 

 

ప్రమోటర్లు కంపెనీల్లో వాటాలను పెంచుకోవడాన్ని మంచి సంకేతంగా అనలిస్టులు పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో వ్యాపార పరిస్థితులు బాగుంటాయన్న సంకేతానికి నిదర్శనంగా చెబుతున్నారు. మార్కెట్లలో అనిశ్చితితో మిడ్‌క్యాప్‌ అంతటా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో కంపెనీలు తమ మిగులు నిధులను వినియోగించుకుకుని బైబ్యాక్‌ చేసేందుకు, ప్రమోటర్లు తమ వ్యక్తిగత నిధులతో వాటాలు పెంచుకునేందుకు అవకాశం. ఈ రెండు కేసుల్లోనూ ఏది జరిగినా అది మైనారిటీ వాటాదారులకు సానుకూల సంకేతమే. కంపెనీ, దాని వృద్ధిపై మేనేజ్‌మెంట్‌కు ఉన్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తుంది’’ అని బీఎన్‌పీ పారిబాస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ దువా తెలిపారు. ఇటీవలే సైయంట్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌, సెలాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా బైబ్యాక్‌ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఐఐఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు ఈ నెల 5-12వ తేదీల మధ్య మార్కెట్‌ ద్వారా మూడు లక్షల షేర్లను కొనుగోలు చేశారు. జైడస్‌ వెల్‌నెస్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, కమర్షియల్‌ ఇంజనీర్స్‌, అడోర్‌ మల్టీ ప్రొడక్ట్స్‌ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్‌ షేర్లను తీసుకున్నారు. ఇక శ్రీకాళహస్తి పైప్స్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, రేమండ్‌, థైరోకేర్‌, యాక‌్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేర్లను కొనుగోలు చేశారు.You may be interested

రాబడుల కంటే పొదుపు ఎంతన్నది ముఖ్యం

Friday 22nd February 2019

చాలా మంది తమ పెట్టుబడులపై అధిక రాబడులు రావాలని కోరుకుంటుంటారు. నిజానికి రాబడుల కంటే మీరు చేసే పెట్టుబడులే కీలకమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్జన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత అంతే మొత్తాన్ని కొనసాగించినా (ఆదాయం పెరుగుతుంది కనుక) మెరుగైన రాబడులు అందుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. కనుక రాబడుల విషయంలో సేవింగ్స్‌ రేటు (పొదుపు రేటు) చాలా కీలకం అవుతుంది.    ఉదాహరణకు...

రుణభారం తగ్గటానికి జీఎంఆర్‌ తంటాలు!

Thursday 21st February 2019

 - ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయానికి ప్రయత్నాలు - సింగపూర్‌ జీఐసీ, జపాన్‌ మిత్సుబిషి ఆసక్తి!! - రూ.5వేల కోట్ల వరకూ సమీకరించే అవకాశం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారీగా పేరుకుపోయిన రుణాలను తగ్గించుకోవటానికి తంటాలు పడుతున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా... తనకు బాగా లాభసాటిగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంలో వాటా విక్రయించే ప్రయత్నాలు మొదలెట్టింది. మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్‌ కంపెనీ మిత్సుబిషి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ

Most from this category