STOCKS

News


ఓపిక పడితే లాభాలు ఎందుకు రావు... ఇదే నిదర్శనం

Thursday 3rd January 2019
Markets_main1546454162.png-23375

స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి, చేతులు కాల్చుకోవడం చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు అనుభవమే. ఎందుకంటే అటువంటి వారి దృష్టంతా రాబడులపైనే కానీ, సరైన కంపెనీలను గుర్తించడంపై శ్రద్ధ ఉండదు. మంచి యాజమాన్యం, వ్యాపార ఫండమెంటల్స్‌, నగదు ప్రవాహాలు, ఏటేటా వ్యాపారంలో వృద్ధి ఇలా ఎన్నో అంశాల ఆధారంగా మంచి స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో భారీ రాబడులు వస్తాయని ఎన్నో కంపెనీలు నిరూపించాయి. ఆ జాబితాలోనిదే కోటక్‌ మహీంద్రా బ్యాంకు. దీనికి సంబంధించిన వివరాలే ఇవి...

 

కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరు 2000 జనవరి 3న రూ.10.30. 2019 జనవరి 2న రూ.1,241. 19 ఏళ్లలో 12000 శాతం వృద్ధి చెందినట్టు. అంటే 2000 సంవత్సరం జనవరి 3న కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరులో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఇంతకాలం పాటు బ్యాంకుపై నమ్మకంతో కొనసాగి ఉంటే... ఈ రోజు ఇన్వెస్టర్‌ పెట్టుబడి విలువ... 1.21 కోట్లు అయి ఉండేది. మరి ఈ స్థాయి లాభాలను ఇచ్చే కంపెనీలను ఎవరైనా కాదనుకుంటారా...? కచ్చితంగా అనుకోరు. కానీ, మెజారిటీ ఇన్వెస్టర్లు ఈ స్థాయి రాబడుల వరకు వేచి చూడరు. తగ్గిందని నష్టానికి అమ్ముకోవడం, లేదా పెరిగిందని కొద్ది మొత్తంలోనే తప్పుకోవడం ఎక్కువ మంది చేసే పని. 

 

కారణం...
ఈ తరహా కంపెనీల్లో పెట్టుబడులను స్థిరంగా కొనసాగించాలంటే అందుకు తొణకని, బెదరని స్థిత ప్రజ్ఞత అవసరం. ఎందుకంటే స్టాక్‌ మార్కెట్‌ అంటేనే పడి లేచే కెరాటలతో కూడిన సముద్రం వంటిది. కొన్న తర్వాత స్టాక్‌ ధర క్షీణిస్తుంటే, పొరపాటు చేశామన్న భావన ఇన్వెస్టర్లలో మొదలవుతుంది. కంపెనీ వ్యాపార మూలాలు బలంగానే ఉన్నప్పటికీ, భయంతో అమ్మేయాలనిపిస్తుంది. తమ పెట్టుబడి నష్టపోతామేమోనన్న భయంలో కంపెనీ యాజమాన్యం సమర్థతలను విశ్లేషించేంత ప్రశాంతత కూడా ఉండదు. అంతిమంగా అమ్మి నష్టపోతుంటారు. 19 ఏళ్ల కాలంలో కోటక్‌ బ్యాంకు షేరు 121 రెట్లు పెరిగింది. అంటే ఏటా 6 రెట్లకు పైగా పెరిగినట్టు. అయితే, నిజానికి ప్రతీ ఏటా ఈ స్థాయిలో పెరగలేదు. 2008 సంక్షోభ సమయంలో కోటక్‌ బ్యాంకు షేరు 84.9 శాతం పతనమైంది. ఆ తర్వాత ఐదేళ్లకు 2008 నాటి గరిష్ట ధరను చేరుకోగలిగింది. అంతేకాదు పలు సందర్భాల్లో ఈ స్టాక్‌ ధర 50 శాతానికి పైగా పతనమైంది. ఈ విధమైన రోలర్‌కోస్టర్‌ రైడ్‌లను చూసి తట్టుకుని, నమ్మకంతో కొనసాగిన వారే లాభాలు తీసుకోగలిగారు. కనుక ఓ కంపెనీకి ఉత్తమ యాజమాన్యం, బలమైన వ్యాపార మూలాలు ఉన్నంత వరకు తొందరపడి విక్రయించవలసిన అవసరం లేదని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. You may be interested

నష్టాల ప్రారంభం​

Thursday 3rd January 2019

ప్రపంచమార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు చైనా ఉత్పాదక రంగం మందగించడంతో ఈ తొలిత్రైమాసికంలో తమ ఐఫోన్‌ మోడళ్ల ఉత్పత్తులను తగ్గిస్తున్నట్లు ఆపిల్‌ ప్రకటనతో ఆసియా మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. జపాన్‌ మార్కెట్‌ నేడు కూడా సెలవులో ఉంది. అయితే ఈ దేశ కరెన్సీ యెన్‌ ర్యాలీ చేయడంతో నికాయ్‌ ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌

విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం సడల్లేదు: విలియం ఓ నీల్‌

Thursday 3rd January 2019

గతేడాది నిరాశ తర్వాత... మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని, 2019లో మార్కెట్‌ ర్యాలీ చేస్తే అన్ని సూచీలు పాల్గొంటాయని విలియం ఓ నీల్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు. మే నెలలో జరిగే ఎన్నికలు కీలకమైన వ్యవహారమని, ఫలితాలు స్టాక్‌ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపవన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలప్పుడు మార్కెట్లు ఏ విధంగా స్పందించాయో గుర్తు చేశారు. భారత్‌ ఇప్పటికీ అత్యంత వేగంగా వృద్ధి

Most from this category