STOCKS

News


లాభాలు, ఆదాయాల్లో నిరంత వృద్ధి

Monday 18th February 2019
Markets_main1550429396.png-24233

పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఓ కంపెనీ ఆదాయం, లాభం ఏటేటా ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనేది ముఖ్యమైనవి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల్లో సుమారు 23 కంపెనీల ఆదాయాలు, లాభాలు 2017 మూడో త్రైమాసికం నుంచి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. 

 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో వార్షికంగా అంతకుమందు అదే కాలంలో పోల్చి చూస్తే 8.8 శాతం వృద్ధితో 10,251 కోట్లుగా నమోదైంది. అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (సెప్టెంబర్‌ త్రైమాసికం)లో నికర లాభం 9,516 కోట్లతో పోల్చి చూసుకున్నా వృద్ధి చెందింది. అంతకుముందు రెండు క్వార్టర్లలో నికర లాభం రూ.9,435 కోట్లు, 9,420 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆర్‌ఐఎల్‌ స్టాక్‌ను 1,333 టార్గెట్‌ ధరతో అక్యుములేట్‌ రేటింగ్‌ను ఎలారా క్యాపిటల్‌ ఇచ్చింది. ఇక సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ విషయంలోనూ ఇంతే. నికర లాభంలో త్రైమాసికం వారీగా వృద్ధి నమోదవుతూనే ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం రూ.8,105 కోట్లు. అంతకుముందు త్రైమాసికాల్లో నికర లాభం 7,901 కోట్లు, 7,340 కోట్లు, 6,904 కోట్లు, 6,531 కోట్లుగా ఉన్నాయి. బీవోబీ క్యాపిటల్‌ టీసీఎస్‌ను రూ.2,390 టార్గెట్‌ ధరకు కొనుగోలు రేటింగ్‌ ఇచ్చింది. మరో ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌ కంపెనీల ఆదాయాలు, నికర లాభాలు కూడా క్రమానుగుతంగా పెరుగుతూ వస్తుండడం గమనార్హం.

 

ఇంకా ఈ జాబితాలో ఎంఫసిస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, మనప్పురం ఫైనాన్స్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, డీసీబీ బ్యాంకు, గనేశ ఎకోస్పియర్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా, కెన్నమెటల్‌ ఇండియా కంపెనీలు ఉన్నాయి. ఆదాయం, నికర లాభం విషయంలో ఇవి ఎప్పటికప్పుడు నూతన విఖరాలను అధిరోహిస్తున్నాయి. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎంఫసిస్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లకు హోల్డ్‌ రేటింగ్‌ ఇచ్చింది. వీటి టార్గెట్‌ ధరలు రూ.1,134, 480గా పేర్కొంది. గణేశ ఎకోస్పియర్‌ వాడి పారేసిన పెట్‌బాటిల్సి నుంచి రీసైకిల్డ్‌ పాలిస్టర్‌ స్టాపుల్‌ ఫైబర్‌, రీసైకిల్డ్‌ పాలిస్టర్‌ స్పన్‌ యార్న్‌ల తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డిసెంబర్‌ క్వార్టర్లో రూ.14.40 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. వార్షికంగా ఇది 56 శాతం వృద్ధి. ఆదాయం సైతం వార్షికంగా 47 శాతం పెరిగి రూ.265 కోట్లుగా నమోదైంది. స్టైలామ్‌ ఇండస్ట్రీస్‌, ట్రాన్స్‌పీక్‌ ఇండస్ట్రీ, ఎస్‌ఆర్‌జీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీఎంఎం ఫౌల్డర్‌, హెస్టర్‌ బయోసైన్సెస్‌, ఎస్‌ఆర్‌జీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలదీ ఆదాయం, లాభాల వృద్ధిలో ఇదే చరిత్ర అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. You may be interested

ఫ్లాట్‌ ప్రారంభం.. అంతలోనే నష్టాల్లోకి..!

Monday 18th February 2019

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాల అందిపుచ్చుకున్న మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 35,831 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 10,738 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే దేశీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా 4రోజూ బలపడంతో ఐటీ షేర్లలో విక్రయాలతో పాటు, అటో, ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాల కారణంగా సూచీల తిరిగి

షేర్ల బైబ్యాక్‌ల సందడి!

Monday 18th February 2019

కంపెనీలు మిగులు నిధులతో షేర్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో మార్కెట్లో సందడి నెలకొంది. షేర్ల బైబ్యాక్‌ విషయంలో టెక్‌ కంపెనీలకు ప్రభుత్వరంగ సంస్థలూ తోడయ్యాయి. 2019 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 45 రోజుల్లో రెండు డజన్ల వరకు కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటనలు చేయడం, ఇందులో కొన్ని కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా ముగిసింది. ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ సుమారు 17,000 కోట్ల

Most from this category