STOCKS

News


పసిడిలో లాభాల స్వీకరణ

Friday 7th June 2019
Markets_main1559884079.png-26145

ఏడు రోజుల వరుస ర్యాలీ అనంతరం పసిడి ఫ్యూచర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 5.50డాలర్లు నష్టంతో 1,337.15డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల పరిస్థితులు పసిడి ధరకు ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి రాత్రి అమెరికాలో ఉద్యోగ గణాంకాల విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోతే డాలర్‌లో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై పసిడి మరింత ర్యాలీ చేసే అవకాశం ఉంది. పసిడికి ప్రస్తుత స్థాయిలో చాలా నిరోద స్థాయిలు ఉన్నాయి. ఒకవేళ పసిడి 1350డాలర్లు కీలక నిరోధ స్థాయిని అధిగించినట్లైతే తదుపరి నిరోధ లక్ష్యం 1370డాలర్లు ఉంటుందని ఐఎన్‌టీఎల్‌ ఎఫ్‌సీ స్టోన్‌ విశ్లేషకుడు ఎడ్వెర్డ్‌ మైర్‌ అభిప్రాయపడ్డారు. ఈ వారంలో మొత్తంగా పసిడి ధర దాదాపు 2.1శాతం లాభపడింది. 
దేశీయంగా రూ.100ల నష్టం:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ 10గ్రాముల పసిడి ధర రూ.103.00లు నష్టపోయి రూ.32697.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగా పసిడి ధరపై ప్రభావాన్ని చూపే రూపాయి స్థిరమైన (1 పైస లాభం) ట్రేడింగ్‌ పసిడి పతనానికి కారణమవుతోంది. 



You may be interested

రెపో తగ్గింది.. మరి వడ్డీయో?

Friday 7th June 2019

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ దీనితో తొమ్మిదేళ్ల కనిష్ఠం 5.75 శాతానికి ఆరుగురు బోర్డు సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం గత ఆరునెలల్లో 0.75 శాతం తగ్గిన రెపో కానీ రుణాలపై ఆ మేరకు వడ్డీ తగ్గించని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీకి మాత్రం ఎప్పటికప్పుడు కోతలు ఇలాగైతే రుణాల్లో వృద్ధి ఉండదంటున్న రేటింగ్‌ సంస్థలు బ్యాంకర్లతో మాట్లాతానన్న ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  విప్రో:- విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను నుంచి అజీమ్ ప్రేమ్‌జీ పదవీ విరమణ చేయనున్నారు. జూలై 30 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. అయితే కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌గా మరో 5ఏళ్లు కొనసాగుతారు. ఆయన స్థానంలో తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. లిండే

Most from this category