డాలర్ రీకవరీ: నష్టాల్లో పసిడి
By Sakshi

ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ తిరిగి పుంజుకోవడంతో పాటు ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి 6.20డాలర్ల నష్టపోయి 1,240.40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో పదేళ్ల ఈల్డ్, ఈక్విటీ షేర్ల పతనం కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,247.40 డాలర్ల వద్ద 5నెలల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అమెరికా - చైనాల మధ్య జరిగిన వాణిజ్య యుద్ధసంధి పట్ల ఇన్వెస్టర్లలలో నెలకొన్న సందిగ్ధత అమెరికా ఈక్విటీ మార్కెట్లను భారీగా దెబ్బతీసింది. ఫెడ్వడ్డీ రేట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి రావడంతో అమెరికా దేశపు పదేళ్ల ఈల్డ్ గణనీయంగా పెరిగింది. ఈ ప్రతికూలాంశాలతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ (0.68శాతం) నష్టపోయి 96.38ల కనిష్టానికి పతనమైంది. పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్ ఇండెక్స్ పతనం పసిడి ధరకి బలాన్నిచ్చింది. ఫలితంగా అక్కడి మార్కెట్లో పసిడి ధర 10 డాలర్ల పెరిగి 1,247.40 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయిని పసిడికి 5నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. చివరికి 7డాలర్ల నష్టపోయి 1,246.60 వద్ద ముగిసింది. నేడు ఆసియాలో ట్రేడింగ్‌లో 1,244.60 డాలర్ల వద్ద ప్రారంభమైంది. పసిడి ఫ్యూచర్ ధరలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ట్రేడర్ల లాభాల స్వీకరణ, అలాగే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ తిరిగికోలుకోవడం పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. నేటి ఇంట్రాడేలో 8డాలర్ల వరకు నష్టపోయి 1,239.80 డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
దేశీయంగానూ తగ్గుదలే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలకు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేడు ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.52.00లు నష్టపోయి రూ.30900.00ల వద్ద ముగిసింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర భారీ పెరుగదల కారణంగా రాత్రి ఎంసీఎక్స్‌లో స్వల్పంగా పెరిగి 30952ల వద్ద ముగిసింది.
You may be interested
ఆర్ఈసీ చేతికి పీఎఫ్సీనా? పీఎఫ్సీ చేతికి ఆర్ఈసీనా?
Wednesday 5th December 2018కేంద్ర ప్రభుత్వం తొలిగా ఆర్ఈసీ చేత పీఎఫ్‌సీని కొనుగోలు చేయించాలని భావించింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చేత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ను కొనుగోలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల కేంద్రానికి రూ.14,000 కోట్లు లభించొచ్చని ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. కాగా ఈ కొనుగోలు ప్రతిపాదినకు క్యాబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. డిసెంబర్ 5 ఈ విషయంపై స్పష్టత
దోమ కుట్టకుండా.. రూ.6వేల కోట్లు!!
Wednesday 5th December 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్!!. ఇక కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న