STOCKS

News


పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ

Friday 2nd November 2018
Markets_main1541138403.png-21652

లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం పసిడి ధర నష్టాల్లో బాట పట్టింది. అమెరికా మార్కెట్లో గురువారం రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 16నెలల గరిష్టస్థాయి నుంచి దిగిరావడంతో అక్కడ ఔన్స్‌ పసిడి 23డాలర్లు లాభపడి 1238.60డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో నవంబర్‌ 06న జరిగే మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత పాలక పక్షమైన రిపబ్లిక్‌ పార్టీపై ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్‌ విజయం సాధిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు ఆసియా ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ మరింత దిగిరావడంతో పాటు ఆసియాలో ఈక్విటీ మార్కెట్లు లాభాల ట్రేడింగ్‌, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కారణంగా పసిడి ఫ్యూచర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.45లకు ఔన్స్‌ పసిడి ధర 5డాలర్ల నష్టంతో 1,233.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా అదే ధోరణి:-
అంతర్జాతీయంగా తగ్గిన పసిడి ధరలకు, డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ కారణంగా దేశీయంగానూ పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.158.00లు నష్టపోయి రూ.31734.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

కోల్‌ ఇండియా ఓఎఫ్‌ఎస్‌ ఓకే

Friday 2nd November 2018

3.18 శాతం వాటా విక్రయం రూ.5,300 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: కోల్‌ ఇండియా వాటా విక్రయం విజయవంతంగా ముగిసింది. ఈ కంపెనీలో 3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. బుధవారం ప్రారంభమైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) గురువారం ముగిసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5,300 కోట్లు సమీకరించింది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు

మార్కెట్‌కు ‘ట్రంప్‌ ట్వీట్‌’ జోష్‌

Friday 2nd November 2018

- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌ - వాణిజ్య అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ట్వీట్‌ - 2 శాతం మేర లాభపడిన ఆసియా మార్కెట్లు - ఒకటిన్నర శాతం లాభాల్లో దేశీ సూచీలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ట్వీట్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను రంకెలు వేయించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడానని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్న అనంతరం మార్కెట్లలో

Most from this category