STOCKS

News


రికార్డుస్థాయి వద్ద లాభాల స్వీకరణ..నష్టాల ముగింపు

Thursday 23rd May 2019
Markets_main1558607049.png-25899

  • 299 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 
  • 11700 వద్ద కింద ముగిసిన నిఫ్టీ

ముంబై: సూచీలు చారిత్మాక గరిష్టానికి తాకిన నేపథ్యంలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 299 పాయింట్ల నష్టంతో 38,811.39 వద్ద, నిఫ్టీ 80.85 పాయింట్లు క్షీణించి 11,657.05 వద్ద స్థిరపడ్డాయి. వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో పాటు, అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోయాయి. మరోవైపు మీడియా, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 117 పాయింట్లు నష్టపోయి 30,409.10 వద్ద స్థిరపడింది.
మరో చరిత్రాత్మక గరిష్టానికి సూచీలు...
కేంద్రంలో కమల వికాసంతో మార్కెట్లకు లాభాల పంట పండింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫలితాలు వెలువడతున్న కొద్ది సూచీల ర్యాలీ కూడా కొనసాగింది. పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. తొలిసారి సెన్సెక్స్‌ 40వేల మార్కును, నిఫ్టీ 12000 స్థాయికి తాకాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ ఆటో, మీడియా, రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్ల సునామి సాగడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 1035 పాయింట్లు పెరిగి 40,124.96 వద్ద, నిఫ్టీ 303 పాయింట్ల లాభపడి 12,041.15 వద్ద  చరిత్రాత్మక గరిష్టాలను నమోదు చేశాయి. 
గరిష్టం నుంచి వెనక్కి...
మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో అనూహ్యంగా అమ్మకాలు మొదలయ్యాయి. సూచీలు కొత్త చరిత్రాత్మక గరిష్టాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీనితోడు ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఫలితంగా సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయి (40,124.96) నుంచి 1474 పాయింట్లు నష్టపోయి 38,651.61 వద్దకు, నిఫ్టీ గరిష్టస్థాయి(12,041.15) నుంచి 438 పాయింట్లు క్షీణించి 11,614.50 వద్దకు ఇంట్రాడే కనిష్టాలకు పతనమయ్యాయి. చివరి అరగంటలో కొంత రికవరి సాధించి నిఫ్టీ 11,657.05 వద్ద, సెన్సెక్స్‌ 38,811.39 వద్ద ముగిశాయి. 
బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, హిందాల్కో, ఐటీసీ, ఐషర్‌ మోటర్స్‌, వేదాంత షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం నష్టపోగా, సిప్లా, గ్రాసీం, ఇండస్‌ఇండ్‌, జీ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 2శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.



You may be interested

సెన్సెక్స్‌ 265 పాయింట్ల గ్యాప్‌అప్‌

Friday 24th May 2019

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో క్రితం రోజు తొలుత కొత్త రికార్డులు నెలకొల్పి, అటుతర్వాత లాభాల స్వీకరణతో తగ్గిన స్టాక్‌ సూచీలు శుక్రవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 265 పాయింట్లు గ్యాప్‌అప్‌తో 39,075 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,750 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధరలు తగ్గడంతో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు బీపీసీఎల్‌, ఐఓసీలు 2-3 శాతం

దౌడు తీస్తున్న అదానీ గ్రూప్‌ షేర్లు

Thursday 23rd May 2019

కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో గురువారం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీ షేర్లైన అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ టాన్స్‌మిషన్స్‌, అదానీ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 7శాతం నుంచి 14శాతం వరకు లాభపడ్డాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌,  అదానీ

Most from this category