STOCKS

News


11770 పాయింట్లను తాకేందుకే ఛాన్స్‌లెక్కువ!

Monday 15th April 2019
Markets_main1555323544.png-25143

నిఫ్టీపై కోటక్‌ సెక్యూరిటీస్‌
గతవారం మొత్తం నిఫ్టీ దాదాపు ప్రతిరోజూ 11600 పాయింట్ల దిగువకు వచ్చి 11550 పాయింట్ల మద్దతును కోల్పోయేందుకే యత్నించింది. కానీ బుల్స్‌ తీవ్రంగా ఈ పతనాలను అడ్డుకొన్నారు. టాటామోటర్స్‌, మారుతీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, సిప్లా లాంటి షేర్ల అండతో సూచీలు రికవరీ బాట పట్టాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు లాంటి బడా దిగ్గజాలు సైతం నిఫ్టీకి అండగా నిలిచాయి. దీంతో ఈ వారం తిరిగి నిఫ్టీ పాజిటివ్‌ మూడ్‌లో ఆరంభమైంది. నిఫ్టీ ప్రస్తుతం 11700 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. చార్టుల్లో దిగువన డోజీ తరహా క్యాండిల్‌ ఏర్పడి మరికొంత అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది. అందువల్ల ఈ దఫా మరోమారు నిఫ్టీ 11770 పాయింట్లను తాకే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ స్థాయి వద్ద తిరిగి అమ్మకాలు ఉండొచ్చు. అయితే ఈ స్థాయిని విజయవంతంగా దాటి క్లోజయితే నిఫ్టీ మరింత పాజిటివ్‌ ధోరణిలో పరుగులు పెట్టవచ్చు. అప్పుడు నిఫ్టీ 11900- 12000 పాయింట్ల వరకు ర్యాలీ జరిపే ఛాన్సులున్నాయి. ఒకవేళ నిఫ్టీ 11550 పాయింట్లను కోల్పోతే దిగువన 11350- 11400 పాయింట్ల వరకు పతనం ఉంటుంది. నిఫ్టీ 11550 పాయింట్ల దిగువకు రానంతవరకు ఒక్కమారైనా 11770 పాయింట్లను పరీక్షించే యత్నం చేస్తుంది. రంగాలవారీగా ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. 



You may be interested

మూడోరోజూ లాభాల ముగింపే..!

Monday 15th April 2019

 అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మార్కెట్‌ మూడోరోజూ లాభంతో ముగిసింది. కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా మెటల్‌, అటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 139 పాయింట్ల పెరిగి 38,905 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,690 వద్ద స్థిరపడింది. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు

స్వల్పకాలానికి షార్ట్‌టర్మ్‌ ఐడియాలు

Monday 15th April 2019

వచ్చే రెండుమూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు 1. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు టార్గెట్‌ రూ. 725. స్టాప్‌లాస్‌ రూ. 610. కొద్దికాలంగా స్థిరంగా రూ. 620 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది, వాల్యూంలు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. 2. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 7700. స్టాప్‌లాస్‌ రూ. 7150.

Most from this category