News


ఒడిదుడుకులు కొనసాగుతాయి: సమీర్‌ అరోరా

Tuesday 6th November 2018
Markets_main1541498135.png-21760

  • ఫైనాన్స్‌ రంగంలో ప్రైవేట్‌ బ్యాంక్‌, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను చూడవచ్చని సూచించిన సమీర్‌ 

ముంబై: మార్కెట్‌ భారీ హెచ్చు తగ్గుల సమయంలో కూడా మంచి రాబడిని పొందినట్లు హీలియోస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు, ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా వెల్లడించారు. ఈ ఏడాది ఒడిదుడుకుల మార్కెట్‌లో షార్ట్‌ బుక్‌ చేయడం ద్వారా 28 శాతం రాబడిని తాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలం ఎక్స్‌పోజర్‌ కలిగిన పలు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను హెడ్జింగ్‌ చేయడం ద్వారా ఈ మేరకు లాభాలను గడించినట్లు వివరించారు. నిజానికి ఈరోజుల్లో షార్ట్‌ చేయడం చాలా క్లిష్టతరంగా మారిపోయిందన్నారు. ఇక లార్జ్‌క్యాప్‌ షేర్లలో టీసీఎస్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని వివరించారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ మాదిరిగా ఆర్‌ఐఎల్‌ సైతం టెలికాం పరిధిని దాటుకుని ఇంటర్‌నెట్‌ కంపెనీగా అవతరించిపోయే అవకాశం ఉందని అంచనావేశారు. మార్కెట్‌లో ఒడిదుడుకులు ఇంకొంతకాలం కొనసాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏడాది ప్రాతిపదిక చూస్తే.. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో మరీ అంత స్థాయిలో అమ్మకాలు నిర్వహించలేదని, రూపీ టెర్మ్స్‌ పరంగా దేశీయ నిధులు మార్కెట్‌ను ఎగువస్థాయిలకు చేర్చాయన్నారు. ఇతర మార్కెట్లలో మాదిరిగా భారత్‌లో రిడెంప్షన్ ఏమంత నష్టపరిచే విధంగా లేదన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ మరింత నష్టపోయే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. వచ్చే 2-3 వారాల్లో రూపాయి విలువ ఇదే స్థాయిలో ఉంటే మాత్రం ఇన్వెస్టర్లలో కాస్త విశ్వాసం పెరుగుతుందని, తద్వారా ఎఫ్‌ఐఐలు కొనుగోలుకు దిగుతారని అంచనావేశారు. ఫైనాన్స్‌ రంగంలో ప్రైవేట్‌ బ్యాంక్‌, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను చూడవచ్చని సూచించారు. డిఫెన్సీవ్‌ రంగాల పరంగా కన్సూమర్‌, ఫార్మా షేర్లను చూడవచ్చన్నారు.
 You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం

Tuesday 6th November 2018

క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్య ముంబై: తాజా కరెక్షన్‌ దెబ్బతో స్టాక్‌ మార్కెట్‌లోని అతి ఆశావాదం ముగిసిందని, పతనం వల్ల నురుగు చల్లారిపోయినట్లేనని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్యానించారు. రానున్న ఏడాదికాలంలో మార్కెట్‌ బెటర్‌గానే ఉంటుందన్నారు. అయితే, జాగ్రత్తగా మాత్రమే పెట్టుబడులను కొనసాగించడం మంచిదని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనందున షాపింగ్‌ లిస్ట్‌ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చేది

నష్టాల్లో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 6th November 2018

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా  మంగళవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ నష్టాల బాట పట్టింది. సూచీలుఓ పలు ప్రభుత్వరంగ షేర్ల నష్టాల ర్యాలీ ఇందుకు కారణమవుతోంది. ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో దాదాపు 1శాతం నష్టపోయి 25,558ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇం‍డెక్స్‌ గత ముగింపు(25732.20)తో పోలిస్తే అరశాతం నష్టంతో 25,596.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category