News


బ్రోకరేజీల ‘డిస్కౌంట్ల’ పోరు

Tuesday 2nd April 2019
Markets_main1554185204.png-24926

-చౌకగా కొత్త తరం బ్రోకరేజ్‌ సంస్థల ఆఫర్లు
-ఆకర్షితులవుతున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు 
-దిగి వస్తున్న పెద్ద బ్రోకరేజ్‌ సంస్థలు 
-డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించిన ఏంజెల్‌ బ్రోకింగ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

ముంబై: కొత్త తరం స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థల ధాటికి సంప్రదాయ బ్రోకరేజ్‌ సంస్థలు దిగిరాక తప్పడం లేదు. జీరోధా, విజ్‌డమ్‌ క్యాపిటల్‌, ఆర్‌కేఎస్‌వీ సెక్యూరిటీ  తదితర సంస్థలు చాలా తక్కువ బ్రోకరేజ్‌ ఫీజులు ఆఫర్‌ చేయడం ద్వారా వ్యాపార పరిమాణాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌ వంటి దిగ్గజ బ్రోకరేజ్‌ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. 

ఏంజెల్‌ బ్రోకింగ్‌ చార్జీ రూ.15-30 మధ్య
ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థ ఫ్లాట్‌ చార్జీలను వసూలు చేసే ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.50,000 లోపు విలువ ఉన్న లావాదేవీకి చార్జ్‌ రూ. 15, అంతకు మించిన విలువ ఉన్న లావాదేవీకి రూ.30 చార్జ్‌నీ వసూలు చేస్తామని ఏంజెల్‌ బ్రోకింగ్‌ తెలిపింది. ఈ ఆఫర్‌ ఈక్విటీ, ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌, కమోడిటీ, కరెన్సీ సెగ్మెంట్లకు వర్తిస్తుందని పేర్కొంది.  తొలిసారిగా స్టాక్‌ మార్కెట్లో  ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్లను  ఆకర్షించే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని ఏంజెల్‌ బ్రోకింగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

యాక్సిస్‌ ఆఫర్‌...ఒక్కో లావాదేవీకి రూ.20.....
మూడో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌... యాక్సిస్‌ బ్యాంక్‌ బ్రోకరేజ్‌ విభాగం...యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ కూడా డిస్కౌంట్‌ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా లావాదేవీ విలువ ఎంత అయినా సరే, ఒక్కో లావాదేవీకి(కొనుగోలు కానీ, అమ్మకం కాని)రూ.20 మాత్రమే చార్జ్‌ చేస్తుంది. మూడు నెలల సగటు బ్యాలెన్స్‌ రూ.75,000 గా ఉన్న బ్యాంక్‌ ఖాతాదారులకు ఈ ఆఫర్‌ వర్తిసుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇతరులు మాత్రం నెలకు రూ.250 మాత్రం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఆఫర్‌ వెలువడిన కొద్ది సేపటికే యాక్సిస్‌ ఈ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఆఫర్‌, ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌కు కూడా వర్తిస్తుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లు చౌక బ్రోకరేజ్‌ ప్లాన్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అరుణ్‌ తుక్రల్‌ చెప్పారు. ఈ తాజా ఆఫర్‌ ద్వారా మార్కెట్‌ వాటాను పెంచుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. 

తక్కువ బ్రోకరేజ్‌ చార్జీల పరంగా చూస్తే, మార్కెట్‌ పరంగా జీరోధానే అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ, ఒక్కో లావాదేవీకి రూ. 20 లేదా లావాదేవీ విలువలో 0.01 శాతం (ఏది తక్కువ అయితే అది వసూలు చేస్తోంది). ఇక డెలివరీ విషయంలో ఈ సంస్థ ఎలాంటి రుసుము వసూల చేయడం లేదు.మరోవైపు విజ్‌డమ్‌ క్యాపిటల్‌ సంస్థ, ఏ సెగ్మెంట్‌ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఇక ఆర్‌కేఎస్‌వీ సెక్యూరిటీస్‌ సంస్థ నెలకు ఐదు లావాదేవీలపై ఎలాంటి రుసుము వసూలు చేయదు. ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.20 మాత్రమే వసూలు చేస్తోంది. శామ్‌కో సెక్యూరిటీస్‌, 5పైసా క్యాపిటల్‌(ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌) తదితర సంస్థలు కూడా డిస్కౌంట్‌ బ్రోకరేజ్‌ ప్లాన్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. 



You may be interested

ప్రమోటర్ల వాటా విక్రయంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్షీణత

Tuesday 2nd April 2019

జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 4శాతానికి పైగా నష్టపోయాయి. సంస్థ ప్రమోటర్లు షేర్ల విక్రయించారనే వార్తలు వెలువడటం ఇందుకు కారణమైంది. నేడు జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.425.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సంస్థ ప్రధాన ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర ఓపెన్‌ మార్కెట్లో మార్చి 13, మార్చి 25 తేదిల మధ్య 76.35లక్షల ఈక్విటీ షేర్లను రూ.333 కోట్లకు విక్రయించారు. అలాగే మరో ప్రమోటింగ్‌ సంస్థ సైక్వేటర్‌ మీడియా సర్వీసెస్‌

భారత్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసిన బీఎన్‌పీ పారిబా

Tuesday 2nd April 2019

దేశీయ మార్కెట్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు బీఎన్‌పీ పారిబా ప్రకటించింది. దీంతో పాటు సెన్సెక్స్‌ డిసెంబర్‌ టార్గెట్‌ను 40వేల నుంచి 42 వేలకు పెంచింది. ఎర్నింగ్స్‌లో స్థిరత్వం, ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహ వేగం కారణంగా మార్కెట్‌పై పాజిటివ్‌గా మారినట్లు తెలిపింది. గతేడాది జూన్‌లో సంస్థ దేశీయ ఈక్విటీల రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. డౌన్‌గ్రేడింగ్‌కు ఎర్నింగ్స్‌పై అనుమానాలు, రూపీ క్షీణత, చమురు ధరల

Most from this category