STOCKS

News


స్మాల్‌క్యాప్స్‌లో ప్రైస్‌ కరెక్షన్‌ ముగిసినట్టే...

Sunday 24th February 2019
Markets_main1551032075.png-24303

గత కొన్ని నెలల్లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ బాగా దిద్దుబాటుకు గురయ్యాయి. ముఖ్యంగా చాలా స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 50 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో అంతకుముందు రెండు, మూడేళ్ల కాలంలో ఇచ్చిన రాబడులన్నీ హరించుకుపోయాయి. మరి దీనికి కారణం ఏంటి? స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఎలా అనుసరించాలి? అనే విషయాలను రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ రాచ్‌ తెలియజేశారు. 

 

గత ఏడాది కాలంలో స్మాల్‌క్యాప్స్‌ చాలా బాగా నష్టపోయాయి. ఇదే కాలంలో రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ఫండ్‌ సైతం 15 శాతం నష్టపోయింది. అయితే, దీనికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు సమీర్‌రాచ్‌. ‘‘2018 ప్రారంభం నుంచి స్మాల్‌క్యాప్‌ విభాగం అధిక వ్యాల్యూషన్లకు చేరుకున్నాయి. దీంతో దిద్దుబాటుకు లోనవక తప్పలేదు. అంతర్జాతీయ అనిశ్చితి, చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, అంచనాల కంటే కార్పొరేట్‌ ఫలితాలు తక్కువగా ఉండడం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రవేశపెట్టడం వంటి పలు కారణాలతో మార్కెట్లు పతనం కాగానే స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కూడా ప్రభావితం అయ్యాయి. దాదాపుగా స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ధరల పతనం పూర్తయింది. అయితే, ఈ స్థాయి పతనం తర్వాత మార్కెట్లు దిద్దుబాటుకు సమయం తీసుకోవడం సహజమే. కనుక కాలావధి ప్రకారం కరెక్షన్‌లో ప్రస్తుతం మార్కెట్‌ ఉందని అంచనా వేస్తున్నాం. స్టాక్స్‌ పూర్తి స్థాయిలో రికవరీ అవడానికి బలహీన చేతుల్లో నుంచి బలమైన చేతుల్లోకి మారాల్సి ఉంటుంది’’ అని సమీర్‌రాచ్‌ వివరించారు. ఎన్నికలు, ఫలితాలు అన్నవి మానసిక పరమైన ప్రభావం వరకేనని, చారిత్రకంగా దీర్ఘకాలంలో మార్కెట్లు ఫండమెంటల్స్‌, స్థూల ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని, ప్రభుత్వాలు ఏవన్నదానితో సంబంధం ఉండదన్నారు. 

 

బలమైన వ్యాపారం, మంచి యాజమాన్యం, సరసమైన ధరల వద్ద లభిస్తున్న స్టాక్స్‌ను పెట్టుబడులకు ఎంచుకుంటామని సమీర్‌రాచ్‌ తెలిపారు. స్వల్పకాలానికే కంపెనీలను మార్చడానికి దూరంగా ఉంటామన్నారు. వ్యాపారం వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయా? అందుకు తగిన వ్యవస్థలు ఏర్పాటయ్యాయా? అన్నది చూస్తామని చెప్పారు. ఇక ఎంచుకునే స్టాక్‌ లిక్విడిటీ సమృద్ధిగా ఉండడం కూడా తమకు కీలకమని తెలిపారు. సాధారణంగా కొనుగోలు చేసి, కొనసాగడం అనే విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తామని వెల్లడించారు. స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు దీర్ఘకాల దృష్టితో ఉంటాయని, వచ్చే కొన్నేళ్లలో చిన్న కంపెనీల వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందుతాయన్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల ఎదుగుదల ఉంటే పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తామని చెప్పారు. వాస్తవిక విలువలకు మించి పెరిగాయని భావించినప్పుడు, యాజమాన్యం విషయంలో ప్రతికూలతలు బయటపడినప్పడు, మా అంచనాలు తప్పినప్పుడు స్టాక్స్‌ను విక్రయిస్తామని తెలిపారు.



You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 25th February 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.8:30లకు ఇండెక్స్‌ 0.50శాతం స్వల్ప లాభంతో 10807.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10808.80 పాయింట్లతో పోలిస్తే కేవలం 1 పాయింట్‌ నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ ట్రేడ్‌ నేపథ్యంలో నేడు దేశీయ సూచీలు సైతం అక్కడక్కడే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చైనాతో వాణిజ్య చర్చలు సజావుగా

స్టాక్స్‌ ఎంపిక ముందు చూడాల్సిన అంశాలు 

Sunday 24th February 2019

దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రితేష్‌ అషర్‌ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.   నిఫ్టీకి బోటమ్‌ పూర్తయిందా... లేక కరెక్షన్‌ ఇంకా ఉందా..? భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఇటీవలి మార్కెట్‌ బలహీనతకు కారణం. ఈ అనిశ్చితి కొన్ని నెలల పాటు కొనసాగొచ్చు. ఎన్నికల అంశం మరిన్ని ఆటుపోట్లకు కారణమవుతుంది. మార్కెట్లు ఈ

Most from this category