STOCKS

News


ఈ ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం: సెంట్రమ్‌

Monday 18th February 2019
Markets_main1550513766.png-24250

జనరిక్‌ ఫార్మా కంపెనీల కంటే సముచిత స్థానంలో ఉన్న బహుళజాతి ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వైజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. కన్జ్యూమర్‌ వ్యాపారంలో పెట్టుబడులకు మంచి కంపెనీలు ఉన్నట్టు చెప్పారు. వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.

 

ఫార్మాలో అవకాశాలు...
చాలా వరకు లార్జ్‌క్యాప్‌ ఫార్మా కంపెనీలు గత నాలుగైదేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌లోనే ఉండిపోలేదు. సన్‌ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ నాలుగు, ఐదేళ్ల కనిష్ట ధరల్లో ఉన్నాయి. ఎఫ్‌డీఏ అంశాలు, అధిక ఆటుపోట్లతో కూడిన ఈ తరహా జనరిక్‌ కంపెనీలకు మేం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సముచిత స్థానాల్లో ఉన్న ఎంఎన్‌సీ లిస్టెడ్‌ ఫార్మా కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నాం. అబ్బాట్‌, శానోఫి లేదా బయోకాన్‌ను పరిశీలించొచ్చు. బయోకాన్‌ ఎంఎన్‌సీ కాకపోయినప్పటికీ యూఎస్‌ఎఫ్‌డీఏపై ఎక్కువగా ఆధారపడి లేదు. అబ్బాట్‌ థైరోనార్మ్‌ అనే జీనన శైలి వ్యాధి నియంత్రణ మందుతో కీలక స్థానంలో ఉంది. 

 

అడాగ్‌ గ్రూపు కంపెనీలపై ఒత్తిళ్లు పోయినట్టేనా?
ఈ స్టాక్స్‌ కొనడం అంటే ఎంతో అనిశ్చితితో కూడుకున్నదే. ఓ స్టాక్‌ మరీ పడిపోయిందని కొనలేం. ఎన్నో కంపెనీలు అప్రాధాన్య ఆస్తులను విక్రయిస్తు‍ండడంపై మాట్లాడుతున్నాం. కానీ, ఎవరైనా కీలకమైన ఆస్తి (రిలయన్స్‌ క్యాపిటల్‌), మంచి వ్యాపారంతో ఉన్నది విక్రయిస్తే అది మంచిది కాదు. అయితే, ఎంఎన్‌సీ కంపెనీ వచ్చి కొంత వాటా తీసుకుంటే, స్వల్ప కాలం లేదా మధ్య కాలానికి కంపెనీకి సానుకూలం అవుతుంది. మరోవైపు లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్టాక్స్‌ను కొనదలిస్తే... వార్తల ఆధారంగా దిద్దుబాటుకు గురైన వాటిని పరిశీలించొచ్చు.You may be interested

ఈ పతనం ఎటు వైపు...?

Monday 18th February 2019

మార్కెట్లు వరుసగా ఏడు రోజులు నష్టపోయాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను దిగొచ్చింది. ఈ పతనం ఎంత వరకు...? గత కనిష్టాలకు వెళుతుందా? ఇలా ఎన్నో సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారన్నది చూద్దాం...   ప్రస్తుత పరిస్థితి: ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50 శాతం పెరిగాయి. డిసెంబర్‌ 2018 త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. ప్రస్తుత కరెక్షన్‌కు కారణం ఇదే. ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది

ఎనిమిదో రోజూ నష్టాలే..!

Monday 18th February 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 10650 మార్కును కోల్పోయింది. ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్టాన్ని తాకడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగడం, దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన ధోరణి, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగడంతో సెన్సెక్స్‌

Most from this category