STOCKS

News


2008 స్థాయిని దాటేసిన నిఫ్టీ పీఈ

Wednesday 27th March 2019
Markets_main1553667619.png-24825

నెల రోజులుగా ఎఫ్‌పీఐలు దాదాపు 40 వేల కోట్ల రూపాయలు కుమ్మరించడంతో దేశీయ సూచీల్లో ర్యాలీ నడుస్తోంది. దీంతో దేశీయ మార్కెట్‌ క్యాప్‌ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ వాల్యూషన్లు రికార్డు స్థాయిలకు చేరాయి. ప్రస్తుతం నిఫ్టీ ట్రైలింగ్‌ పీఈ మల్టిపుల్‌ 25.9 వద్ద కదలాడుతోంది. 2000 సంవవత్సరం తర్వాత దేశీయ మార్కెట్‌ పీఈ విలువ ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. 2009 సంక్షోభం తర్వాత యూఎస్‌, భారత్‌ మార్కెట్ల పీఈలు మాత్రమే తిరిగి ఆ స్థాయిలను దాటేశాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ పీఈ 15సంవత్సరాల సరాసరికి 45 శాతం ప్రీమియంతో ఉంది. మరోవైపు ఎంఎస్‌సీఐ వర్ధమాన సూచీ, ఎంఎస్‌సీఐ వరల్డ్‌ సూచీలు తమ పదిహేనేళ్ల సరాసరి పీఈల కన్నా వరుసగా 10, 11 శాతం దిగువనే ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఇండియా మార్కెట్‌ చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌ క్యాప్‌ ఆధారిత టాప్‌ 20 ప్రపంచ మార్కెట్లలో అత్యంత ఖరీదైన మార్కెట్‌గా భారత్‌ స్థానం సంపాదించింది. నిఫ్టీ పీఈ తన అంకమాధ్యమ(మీన్‌) స్థాయి కన్నా రెండు స్టాండర్డ్‌ డీవియేషన్ల దూరంలో ఉంది. గత 19 సంవత్సరాల్లో జరిగిన 4663 ట్రేడింగ్‌ దినాల్లో కేవలం 44 రోజుల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి కనిపించింది. నిఫ్టీ50 స్టాకుల్లో ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఏసియన్‌పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌ సహా 19 స్టాకులు నిఫ్టీ కన్నా ఎక్కువ పీఈతో ఉన్నాయి. ఇవన్నీ కలిసి నిఫ్టీ వెయిటేజ్‌లో 48 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పీఈ విలువ ఈ రకంగా పెరిగేందుకు ప్రధాన కారణం ఈపీఎస్‌(ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌) పతనం కావడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత క్యాలెండర్‌ సంవత్సరంలో నిఫ్టీ ఈపీఎస్‌ అంతకుముందేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గింది. క్యు4 ఫలితాలు మెరుగ్గాఉంటే తప్ప పీఈ విలువ దిగిరాదని, ఫలితాలు నిరాశపరిస్తే సూచీల్లో ఓవర్‌ పీఈ కారణంగా దిద్దుబాటు ఉండొచ్చని నిపుణుల అంచనా. You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Wednesday 27th March 2019

నెల రోజుల్లో దాదాపు 14 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1650. స్టాప్‌లాస్‌ రూ. 1430. దాదాపు మూడేళ్లుగా హయ్యర్‌ రైజింగ్‌ ఛానెల్‌లో ప్రయాణిస్తూ అప్‌ట్రెండ్‌లోనే ఉంటోంది. ఇటీవలే స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ అనంతరం తిరిగి మరో పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఏడీఎక్స్‌ తదితర సూచీలు పాజిటివ్‌గా ఉన్నాయి. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 2. పవర్‌గ్రిడ్‌: కొనొచ్చు.

ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ

Wednesday 27th March 2019

-ఒక్కో షేర్‌కు రూ.980 ధర -ఇది అవాంఛనీయ ఓపెన్‌ ఆఫర్‌ -బైబ్యాక్‌ను పక్కన పెట్టిన మైండ్‌ట్రీ  మైండ్‌ ట్రీ కంపెనీ  టేకోవర్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మం‍గళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా  31 శాతం వాటాకు

Most from this category