STOCKS

News


ఎన్నికల ముందే కొనుగోళ్లకు ఛాన్స్‌!

Saturday 9th February 2019
Markets_main1549712825.png-24114

డీకే అగర్వాల్‌ సూచన
సాధారణ ఎన్నికలకు ముందు సరైన కొనుగోళ్లకు అవకాశం వస్తుంటుందని, ఇన్వెస్టర్లు ఈ సమయంలో సంపద సృష్టి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రముఖ అనలిస్టు డీకే అగర్వాల్‌ సూచించారు. ఈ దఫా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పలు జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై వినిమయం మరింత జోరందుకుంటుందని, ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారుతుందని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న రేట్‌ కట్‌ నిర్ణయం మోదీ ప్రభుత్వానికి అందించిన అనూహ్యమైన ప్రోత్సాహక గిఫ్టన్నారు. త్వరలో ఎలక‌్షన్లు రానున్నాయని, మరోపక్క అంతర్జాతీయ పరిస్థితులు పెద్దగా బాగాలేవని, అందువల్ల మార్కెట్లలో ఒడిదుడుకులకే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. గతాన్ని పరిశీలిస్తే మార్కెట్లకు స్థిరప్రభుత్వాలు మాత్రమే నచ్చుతాయని తెలుస్తోందన్నారు. ప్రస్తుతం చాలామంది ఇన్వెస్టర్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ విజయాన్ని ఊహిస్తున్నారన్నారు. ఇదే నిజమైతే మార్కెట్లలో పెద్ద ర్యాలీ ఉంటుందన్నారు. అయితే స్థూలంగా పరిశీలిస్తే దేశీయ ఎకానమీకి కీలకమైన వృద్ది కారకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ముందుకే సాగుతాయని చెప్పారు. కానీ ఎన్నికల వేళ స్థిర ప్రభుత్వ ప్రభావం మార్కెట్‌పై ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులతో బలమైన పోర్టుఫోలియో తయారు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చిన్న స్టాకుల కన్నా లార్జ్‌ క్యాప్స్‌ బాగున్నాయని చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో కార్పొరేట్‌ బ్యాంకుల బాలెన్స్‌ షీట్లు లాభపడతాయన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల ఎర్నింగ్స్‌ పాజిటివ్‌గా మారతాయని అంచనా వేశారు.
- ఇన్‌ఫ్రా, సిమెంటట్‌, ఆటో, క్యాపిటల్‌గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. 
- ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఆటో, అల్ట్రాటెక్‌సిమెంట్‌, యూపీఎల్‌ షేర్లను ఆయన సిఫార్సు చేశారు. 

 



You may be interested

బయటపడేందుకు చివరి అవకాశం!

Saturday 9th February 2019

ఇన్వెస్టర్లకు సామ్‌కో సెక్యూరిటీస్‌ సూచన దేశీయ మార్కెట్లు మరింత ముందుకు దూసుకుపోయే సత్తా కోల్పోయాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. ఇకపై సూచీలు వెనుకంజ వేయక తప్పదని అంచనా వేశారు. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను వదిలించుకునేందుకు ఇదే మంచి తరుణమని, తేడా వస్తే మార్కెట్‌క్రాష్‌లో ఇరుక్కుపోతారని హెచ్చరించారు. గతవారం నిఫ్టీ చార్టుల్లో ఈవెనింగ్‌స్టార్‌ను ఏర్పరిచిందని, బేరిష్‌నెస్‌కు ఇది సంకేతమని వివరించారు. నిఫ్టీ బలంగా 11,000 వేల పాయింట్లపైకి వెళ్లినా,

ఎంఎఫ్‌లకు క్రిసిల్‌ ర్యాకింగ్‌లు

Saturday 9th February 2019

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. లిక్విడిటీపై ఆందోళన, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితులు.. ఈక్విటీలపై ప్రభావం చూపాయి. దీంతో చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌ పేలవ ప్రదర్శన చూపాయి. డిసెంబర్‌ నాటికి ఎంఎఫ్‌లు చూపిన ప్రదర్శన ఆధారంగా 474ఫండ్స్‌కు క్రిసిల్‌ ర్యాంకులిచ్చింది. ఇందులో 211 ఎంఎఫ్‌లు ఈక్విటీ ఫండ్స్‌ కాగా, 215 డెట్‌, 48 హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ర్యాంకింగ్‌లో యాక్సి్‌స్‌ ఎంఎఫ్‌, కోటక్‌ మహీంద్రా ఎంఎఫ్‌లు తమ

Most from this category