STOCKS

News


ఎన్నికల ముందస్తు ర్యాలీ... కొనుగోళ్లకు అవకాశం

Monday 11th March 2019
Markets_main1552243626.png-24521

నిఫ్టీ గత వారం మంచి ర్యాలీ చేసింది. వారాంతంలో 11,000 పైన క్లోజయింది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ అప్‌ట్రెండ్‌ను కొనసాగించాయి. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌, డెరివేటివ్స్‌ విభాగంలో నికర కొనుగోలుదారులుగా మారారు. అదే సమయంలో దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐ), నికర విక్రయాలవైపునకు మళ్లారు. గరిష్ట స్థాయిలకు చేరడంతో లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ వాయుదాడులకు దిగిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయి. దీంతో రోజురోజుకు సెంటిమెంట్‌ మెరుగుపడుతోందని, ఫండ్‌మెంటల్‌గా బలంగా ఉన్న స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని ఈక్విటీ 99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ సూచించారు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మూడు స్టాక్స్‌ను సూచించారు.

 

ఐటీడీ సిమెంటేషన్‌
ఎనిమిది దశాబ్దాలుగా దేశంలో నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ. డిజైన్‌, ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ విభాగాల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. జనవరి-డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా కంపెనీ పాటిస్తోంది. 2018 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో అమ్మకాలు 11.41 శాతం పెరిగిగాయి. ఎబిట్డా 25 శాతం పెరిగి 90.6 కోట్లు, నికర లాభం 91 శాతం వృద్ధితో రూ.33.80 కోట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద లాభం 62 శాతం పెరిగి రూ.118 కోట్లుగాను, ఆదాయం 25 శాతం పెరిగి 2,575 కోట్లుగాను ఉన్నాయి. కంపెనీ ఆర్డర్ల విలువ రూ.9,591 కోట్లుగా ఉంది. స్టాక్‌ 18పీఈ వద్ద ఉంది. సాంకేతికంగా ఈ స్టాక్‌ చార్ట్‌లో బలంగా కనిపిస్తోంది. క్రమంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి కొనుగోలు చేసుకోవచ్చు. 

 

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
ఇది కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిర్మాణ రంగ కంపెనీయే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో, డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 54 శాతం పెరిగి రూ.727 కోట్లుగాను, నికర లాభం రూ.47.35 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌ వరకు చూస్తే నికర లాభం 32 శాతం పెరిగి రూ.185 కోట్లు, ఆదాయం 84 శాతం పెరిగి రూ.2,021 కోట్లుగాను ఉన్నాయి. 12.3 పీఈ వద్ద ట్రేడవుతోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు 22.34 శాతం, ఎఫ్‌ఐఐలకు 6.32 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఆర్డర్ల విలువ రూ.7,965 కోట్లుగా ఉంది. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి క్రమంగా కొనుగోలు చేసుకోవచ్చు.

 

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌
డిసెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాల ఆదాయం రూ.89 శాతం పెరిగి రూ.2,156 కోట్లు, నికర లాభం 73 శాతం పెరిగి రూ.64 కోట్లుగాను నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలల కాలంలో నికర లాభం 81 శాతం పెరిగి రూ.138 కోట్లు, అమ్మకాలు 57 శాతం పెరిగి రూ.4,874 కోట్లుగాను ఉన్నాయి. ప్రస్తుతం 23.3 శాతం పీఈ వద్ద ట్రేడవుతోంది. మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం కొనుగోలు చేసుకోవచ్చు.
 You may be interested

ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గినా... ఆశావహమే!

Monday 11th March 2019

ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.23.16 లక్షల కోట్లుగా ఉంది. జనవరితో పోలిస్తే ఫ్లాట్‌గానే ఉంది. ఫిబ్రవరిలో ఫండ్స్‌ నుంచి రూ.20,083 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. జనవరిలో మాత్రం నికరంగా రూ.65,439 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల రాక మోస్తరు స్థాయికి చేరడం, లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరణలే ఫిబ్రవరిలో నిధుల తగ్గుదలకు కారణం.    ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో ఈక్విటీ

జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ vs ఆర్సెల్లార్‌ మిట్టల్‌

Saturday 9th March 2019

ఏసియన్‌ కలర్‌ కోటెడ్‌ ఇస్పాత్‌ కోసం హోరాహోరి దివాలా కోర్టుకు చేరిన ఏసియన్‌ కలర్‌ కోటెడ్‌ ఇస్పాత్‌ను సొంతం చేసుకునేందుకు సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలార్‌ మిట్టల్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న ఇరుకంపెనీలు ఇస్పాత్‌ కోసం బిడ్లు సమర్పించాయి. వీటితో పాటు పలు ఇతర ఫండ్స్‌సైతం ఈ కంపెనీ కోసం పోటీ పడుతున్నా, ప్రధానంగా ఈ రెండే రేసులో ఉన్నాయి.

Most from this category