STOCKS

News


ఎన్నికల ముందస్తు ర్యాలీయేనా?

Thursday 7th March 2019
Markets_main1551897536.png-24458

మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు ర్యాలీ చేయడం ఆరంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారం నెలబెట్టుకునే అవకాశాలు పెరగడమే దీనికి కారణమన్నది విశ్లేషకుల అంచనా. పాకిస్థాన్‌ చర్యలపై మోదీ సర్కారు అనుసరించిన విధానంతో గెలుపు అవకాశాలు పెరిగాయని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి స్టాక్స్‌లో ఎన్నికల ముందుస్తు ర్యాలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌ 2013 నుంచి 2018 మధ్య ఎంతో ర్యాలీ చేశాయి. ఈ ర్యాలీ 2018 జనవరిలో ముగిసింది. అధిక వ్యాల్యూషన్లకు చేరడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీల్లో సెబీ చేసిన మార్పులతో నిధుల రాక తగ్గడం, లిక్విడిటీ కొరత, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వంటి అంశాలు ప్రభావం చూపించాయి. దీంతో గరిష్ట స్థాయిల నుంచి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు భారీగా పడిపోయాయి. ‘‘సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల వర్గీకరణ దిశగా చేసిన ఆదేశాలతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో నిర్మాణాత్మకపరమైన నష్టం జరిగింది. అలాగే, తనఖా పెట్టిన షేర్లు లార్జ్‌క్యాప్‌ కంటే ఈ విభాగం షేర్లకు మరింత నష్టం చేకూర్చాయి’’ అని కేఆర్‌ చోక్సే గ్రూపు ఎండీ దేవేన్‌ చోక్సీ తెలిపారు. కానీ, ఈ ధోరణిలో ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ గత వారం వ్యవధిలోనే 2.4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 3.4 శాతం ర్యాలీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇదే కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అర శాతమే ర్యాలీ చేయడం గమనార్హం. 

 

‘‘మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో ఎంతో విలువ ఉంది. ఎన్నికల ముందస్తు ర్యాలీ వీటికి అనుకూలించనుంది. బాలాకోట్‌ వాయుదాడుల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశాలు పెరిగాయి’’ అని చోక్సే తెలిపారు. ఎన్నో సంవత్సరాల కనిష్ట విలువల వద్ద స్టాక్స్‌ ట్రేడవుతున్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి బలమైన ఆర్‌వోసీఈ, క్లీన్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలపై దృస్టి సారించొచ్చని సూచిస్తున్నారు. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ విభాగంలో గత ఐదేళ్లుగా ఆర్‌ఓసీఈ, ఆర్‌వోఏ 15 శాతానికి పైగా ఉన్న కంపెనీలను పరిశీలిస్తే... అవంతి ఫీడ్స్‌, ధనూకా అగ్రిటెక్‌, స్వరాజ్‌ ఇంజన్స్‌, అజంతా ఫార్మా, క్యాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్‌, ఈ క్లర్క్స్‌, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌, అసెల్యా కాలే సొల్యూషన్స్‌, సింఫనీ, బజాజ్‌ కన్జ్యూమర్‌కేర్‌, సన్‌టీవీ, ల్యామాక్స్‌ ఇండస్ట్రీస్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఉన్నాయి. 

 

మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దీర్ఘకాలిక సగటు 16 రెట్ల కంటే దిగువకు పడిపోయిందని, ఇలా జరిగితే తిరిగి పెరగడం ఆరంభమవుతుందని చరిత్ర చెబుతున్నట్టు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రిస్క్‌ తీసుకుని మార్కెట్లోకి ప్రవేవించి, మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకునేందుకు ఇది సరైన తరుణంగా ప్రైమ్‌ సెక్యూరిటీస్‌ ఎండీ ఎన్‌ జయకుమార్‌ తెలిపారు. ‘‘ఈ విడత కరెక్షన్‌ బ్రోడ్‌బేస్డ్‌గా ఉంటుంది. ఆర్‌వోసీఈ 15 శాతానికి పైన ఉన్నవి గరిష్టాల నుంచి 35 శాతం కరెక్ట్‌ అయ్యాయి. మిగిలిన స్టాక్స్‌లో కూడా ఇంతకంటే ఎక్కువ పతనం ఉంది. నాణ్యమైన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలను కొనుగోలు చేసుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశం అని మా అభిప్రాయం’’ అని ఎడెల్వీజ్‌ ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ తెలిపింది.


 You may be interested

లాభాల ప్రారంభం

Thursday 7th March 2019

దేశీయ మార్కెట్‌ నాలుగో రోజూ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 108 పాయింట్ల లాభంతో 36,744 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11,078 వద్ద ప్రారంభమైంది.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడటంతో, డాలర్‌ మారకంలో రూపాయి తగ్గుదల, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడం తదితర సానుకూల సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అయితే ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన వాతావరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది

రెండంకెల్లో రాబడులకు ఎడిల్‌వీజ్‌ బెట్స్‌

Wednesday 6th March 2019

ప్రపంచ మార్కెట్లకు భౌగోళిక ఉద్రిక్తతలు, వృద్ధి మాంద్యం వంటి రిస్క్‌లు వున్నాయని, అయితే ఏడాదికాలంగా భారీగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లలో కొన్ని రానున్న రోజుల్లో మంచి రాబడులు ఇచ్చే అవకాశం వుందని బ్రోకరేజ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2017లో పెద్ద ర్యాలీ జరిపి, 2018లో భారీ పతనాన్ని చవిచూసి, ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ క్షీణిస్తూ వచ్చిన కొన్ని మిడ్‌క్యాప్‌ షేర్లు కొనుగోలుకు అనుకూలంగా వున్నాయని ఎడిల్‌వీజ్‌ వివరించింది.

Most from this category