STOCKS

News


5 స్మాల్‌క్యాప్స్‌..ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు!

Monday 25th June 2018
Markets_main1529924268.png-17715

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లీలాధర్ అంచనావేస్తోంది. 2018లో నిఫ్టీ ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ రూ.450.9 ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి 54 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 స్మాల్‌క్యాప్‌ షేర్లను సిఫార్సు చేసింది. అవేంటంటే..

ఇప్కా లాబొరేటరీస్ | టార్గెట్‌ ధరూ రూ.837 | రాబడి అంచనా 24.4 శాతం
అన్ని ప్రధాన బిజినెస్‌ వర్టికల్స్‌ నుంచి ఈ కంపెనీ రికవరీ సాధిస్తుందని వివరించింది. యూఎస్‌ జనరిక్స్‌, డబ్ల్యూహెచ్‌ఓ మార్కెట్‌లో లేని చోట అంతర్జాతీయ టెండర్లను వేస్తుండడం, దేశీయ ఫార్ములేషన్స్‌, ఏపీఐ ఆధారంగా రికవరీ సాధిస్తున్నట్లు వివరించిన బ్రోకింగ్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను రూ.837గా నిర్ణయించినట్లు వెల్లడించింది.

సద్భావ్‌ ఇంజినీరింగ్‌ | టార్గెట్‌ ధరూ రూ.456 | రాబడి అంచనా 54 శాతం
2018 ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.13,250 కోట్లకు చేరుకుని ఏడాది ప్రాతిపదికన 72.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసిందని వివరించింది. గతేడాదిలో ఆర్డర్‌ ఇన్‌ఫ్లో రూ.8,600 ఉన్నట్లు తెలిపింది. 

ర్యాలీస్‌ ఇండియా | టార్గెట్‌ ధరూ రూ.262 | రాబడి అంచనా 30.8 శాతం
జీఎస్‌టీ ముందు సవాళ్లు, ధరల ఒత్తిడి, బలమైన అమ్మకాల వృద్ధిరేటు లాంటి మిశ్రమ అంశాలతో 2018 ఆర్థిక సంవత్సరం పూర్తిచేసిన ఈ సంస్థ నూతన ప్రాడెక్ట్‌ లాంచ్‌లతో ఇక మీదట ఆకర్ణణీయ వృద్ధిరేటును సాధించనుందని భావిస్తోంది. 17 శాతం ఆర్‌ఓఈ అంచనవేసినట్లు తెలిపింది.

హెడెల్‌బెర్గ్ సిమెంట్ ఇండియా | టార్గెట్‌ ధరూ రూ.194 | రాబడి అంచనా 44.7 శాతం
గడిచిన రెండేళ్లలో సెంట్రల్‌ రీజన్‌లో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. యూపీ, బీహార్‌లలో ఇసుక కొరత ఉన్నప్పటికీ.. హెచ్‌ఈఐఎమ్‌ అమ్మకాలలో 6.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసినట్లు వెల్లడించింది. 2020 ఆర్థిక సంవత్సర ఎంటర్‌ప్రైజ్‌ వాల్యూ/ఎబిడిటా10 రెట్లు ఆధారంగా షేరుకు రూ.194 టార్గెట్‌ ధరను అంచనాకట్టినట్లు వెల్లడించింది.

నవనీత్‌ ఎడ్యుకేషన్‌ | టార్గెట్‌ ధరూ రూ.161 | రాబడి అంచనా 29.1 శాతం
గుజరాత్‌, మహారాష్ట్ర ప్రాంతాలలో పబ్లికేషన్‌ రంగంలో 65-70 శాతం మార్కెట్‌ వాటాను కలిగిన ఈ సంస్థ అత్యంత తక్కువ డెట్‌ను కలిగి ఉండి ఆకర్షణీయ రిటర్న్‌ రేషియోను కలిగిఉందని వివరించింది. 2018-20 ఆర్థిక సంవత్సరాల నగదు లాభం సగటున రూ.200 కోట్లు అంచనాతో షేరును సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

బ్యాంకర్లను వేధించే ఉద్దేశం లేదు

Monday 25th June 2018

ముంబై: రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎస్‌కే గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, ఈడీల అరెస్టులు అసాధారణమైనవని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఉదంతం ఆధారంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులను కేంద్రం వేధిస్తోందని భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఏఐఐబీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అధికారి ఈ వివరాలు తెలిపారు. డీఎస్‌కే గ్రూప్‌ అధినేత

4 మిడ్‌క్యాప్‌ సిఫార్సులు.. 45 శాతం వరకు రాబడి..!

Monday 25th June 2018

కంపెనీ ఫండమెంటల్స్‌ ఆధారంగా దీర్ఘకాలంలో 46 శాతం వరకు రాబడి ఇవ్వగలిగిన 4 మిడ్‌క్యాప్‌ షేర్లను ప్రభుదాస్‌ లీలాధర్ సిఫార్సుచేసింది. అవేంటంటే.. జిందాల్ స్టీల్ & పవర్ | టార్గెట్‌ ధరూ రూ.330 | రాబడి అంచనా 46.6 శాతం స్టీల్‌ ధరల అవుట్‌ లుక్‌ ఆకర్షణీయంగా ఉన్న కారణంగా ఈ షేరును సిఫార్సు చేసినట్లు తెలిపింది. ఇబిటా అంచనా 2019లో రూ.9,000.. 2020లో రూ.9,800 ఉండనున్నట్లు లెక్కించింది. 2020 ఆర్థిక సంవత్సర

Most from this category