STOCKS

News


4 మిడ్‌క్యాప్‌ సిఫార్సులు.. 45 శాతం వరకు రాబడి..!

Monday 25th June 2018
Markets_main1529924035.png-17714

కంపెనీ ఫండమెంటల్స్‌ ఆధారంగా దీర్ఘకాలంలో 46 శాతం వరకు రాబడి ఇవ్వగలిగిన 4 మిడ్‌క్యాప్‌ షేర్లను ప్రభుదాస్‌ లీలాధర్ సిఫార్సుచేసింది. అవేంటంటే..

జిందాల్ స్టీల్ & పవర్ | టార్గెట్‌ ధరూ రూ.330 | రాబడి అంచనా 46.6 శాతం
స్టీల్‌ ధరల అవుట్‌ లుక్‌ ఆకర్షణీయంగా ఉన్న కారణంగా ఈ షేరును సిఫార్సు చేసినట్లు తెలిపింది. ఇబిటా అంచనా 2019లో రూ.9,000.. 2020లో రూ.9,800 ఉండనున్నట్లు లెక్కించింది. 2020 ఆర్థిక సంవత్సర ఎంటర్‌ప్రైజ్‌ వాల్యూ/ఎబిడిటా 7.4 రెట్లు ఆధారంగా షేరుకు రూ.330 టార్గెట్‌ ధరను అంచనాకట్టినట్లు వెల్లడించింది.

ఇంద్రప్రస్థ గ్యాస్ | టార్గెట్‌ ధరూ రూ.344 | రాబడి అంచనా 34.8 శాతం
అందుబాటు ధరలు, వినియోగదారుల సంఖ్య పెరగడం ద్వారా సిటీ గ్యాస్‌ పంపిణీ ఎర్నింగ్స్‌ పెరగనున్నాయన్న అంశం ఆధారంగా షేరును సిఫార్సుచేసింది. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలు గ్యాస్‌కు మారుతుండడం వల్ల మార్జిన్లు మరింత పెరుగుతాయని భావిస్తోంది.

క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ | టార్గెట్‌ ధరూ రూ.299 | రాబడి అంచనా 34.2 శాతం
ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్బుల విభాగంలో మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నట్లు వెల్లడించిన ప్రభుదాస్‌ లీలాధర్.. ప్రీమియం ఫ్యాన్ల విభాగంలో 27 శాతం మార్కెట్‌ వాటాను కలిగిన సీజీసీఈఎల్‌ వచ్చే 2-3 ఏళ్లలో 300 బేసిస్‌ పాయింట్ల వృద్ధిరేటును సాధించవచ్చని భావిస్తోంది.

ఎరీస్‌ లైఫ్‌సైన్సెస్‌ | టార్గెట్‌ ధరూ రూ.885 | రాబడి అంచనా 25.9 శాతం
ఎంపిక చేసిన వైద్యవిభాగాల్లో బ్రాండెడ్‌ ఫార్మా ఉత్పత్తులను అందిస్తున్న ఈ సంస్థ 2020 ఆర్థిక సంవత్సరంలో 40 శాతం ఇబిటా మార్జిన్లను సాధించవచ్చని అంచనావేసింది. క్యాపిటల్‌ రిటర్న్‌ రేషియో అధికంగా ఉండడం, క్యాష్‌ఫ్లో బలంగా ఉండడం, అప్పులేని కంపెనీగా ఉండడం లాంటి అంశాల ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.885గా నిర్ణయించినట్లు వెల్లడిచింది.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

5 స్మాల్‌క్యాప్స్‌..ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు!

Monday 25th June 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లీలాధర్ అంచనావేస్తోంది. 2018లో నిఫ్టీ ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ రూ.450.9 ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలానికి 54 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 స్మాల్‌క్యాప్‌ షేర్లను సిఫార్సు చేసింది. అవేంటంటే.. ఇప్కా లాబొరేటరీస్ | టార్గెట్‌ ధరూ రూ.837 | రాబడి అంచనా 24.4 శాతం అన్ని ప్రధాన బిజినెస్‌ వర్టికల్స్‌ నుంచి

16 షేర్లు.. 50 శాతం వరకు రాబడి..!

Monday 25th June 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లీలాధర్ అంచనావేస్తోంది. 2018లో నిఫ్టీ ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ రూ.450.9 ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాల కారణంగా తమ అంచనాల కంటే ఇది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) గణనీయంగా దోహదం చేయనున్నాయనే అంచనామేరకు 2019 ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు 17.3 శాతంగా

Most from this category