STOCKS

News


వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Monday 29th October 2018
Markets_main1540802522.png-21563

ముంబై:- మార్కెట్‌ ర్యాలీ భాగంగా సోమవారం విద్యుత్‌ షేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బీఎస్‌ఈలో విద్యుత్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50 శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ 2శాతం లాభంతో 1950.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన అదానీ పవర్‌ అత్యధికంగా 20శాతం, టాటా పవర్‌ 14శాతం లాభపడ్డాయి. వాటితో పాటు టోరెంట్‌ పవర్‌ 6శాతం, రిలయన్స్‌ ఇన్ఫ్రా, అదానీ ట్రాన్స్‌పోర్ట్స్‌ 5శాతం చొప్పున లాభపడ్డాయి, వాటితో పాటు జీఎంఆర్‌ ఇన్ఫ్రా, జేఎస్‌డబ్ల్యూ 4శాతం, సుజ్లాన్‌ 3శాతం, కేఈసీ, సిమెన్స్‌ షేర్లు 2శాతం, సీజీ పవర్‌, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్‌ భెల్‌ షేర్లు1శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు థెరాక్స్‌, ఎన్‌టీపీసీ, ఎబీబీ షేర్లు అరశాతం నష్టపోయాయి.You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలి?

Monday 29th October 2018

సోమవారం ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు దాదాపు 9 శాతం దూసుకుపోయింది. బ్యాంకు క్యు2 ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లు పెరిగాయి. బ్యాంకు ఆస్తుల నాణ్యత ఈ త్రైమాసికంలో మెరుగుపడింది. జీఎన్‌పీఏలు 8.54 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై ఎలాంటి సిఫార్సులు చేస్తున్నాయో చూద్దాం... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 460. కీలక పీపీఓపీ వృద్ది కొనసాగిస్తోంది. ఎన్‌ఐఎంలు విస్తరించడం

ఐటీసీపై పాజిటివ్‌ అంటున్న అనలిస్టులు

Monday 29th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు ఐటీసీపై బుల్లిష్‌గా మారారు. ప్రస్తుత రిస్క్‌రివార్డు నిష్పత్తి ఆనుకూలంగా ఉందని, స్టాకు ఇతర ఎఫ్‌ఎంసీజీ స్టాకులతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తోందని భావిస్తున్నారు.  వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు.. - సిటి: టార్గెట్‌ రూ. 340. స్థిరమైన ఫలితాలు ప్రకటించింది. సిగిరెట్‌ వాల్యూం గ్రోత్‌ ఆరోగ్యకరంగా ఉంది. భవిష్యత్‌ వృద్ధికి సిగిరెట్‌ వాల్యూంలు ప్రేరకంగా పనిచేస్తాయి. షేరు తన ఐదేళ్ల సరాసరి

Most from this category