STOCKS

News


మార్కెట్లకు పావెల్ బూస్ట్‌

Thursday 29th November 2018
Markets_main1543467746.png-22466

న్యూయార్క్: స్టాక్‌ మార్కెట్లకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లన్నీ లాభాలను నమోదుచేశాయి. ‘అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు తటస్థ స్థాయిలో ఉన్నాయనే అంచనాలు విస్తృత పరిధిలో ఉండగా..ఇంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవడానికి కానీ, వృద్ధి మందగించే స్థాయిలో కానీ లేవు.’ అని ఆయన బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఎకనామిక్ క్లబ్‌లో వ్యాఖ్యానించారు. సరిగ్గా రెండు నెలల కిందట వడ్డీ రేట్ల అంశంపై మాట్లాడిన ఆయన, అప్పట్లో పెంపునకే ఫెడ్‌ మొగ్గు చూపుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటిది ఒక్కసారిగా ఆయన స్వరంలో మార్పు రావడం అనేది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాల్లో మెతక వైఖరి మొదలైందనే విషయానికి అద్ధం పడుతున్నారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడ్‌ దూకుడు తగ్గిందనే అంచనాలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మూడు శాతం వరకు లాభపడ్డాయి. డోజోన్స్‌ ఏకంగా 617 పాయింట్లు లాభపడింది. దేశీ మార్కెట్‌లో నిఫ్టీ 10,809 వద్ద ప్రారంభమైంది.

ట్రంప్‌ ప్రభావం..
ఇంతకుముందు వేగంగా వడ్డీ రేట్లను పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫెడ్‌పై పదేపదే దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్‌ బ్యాంక్‌ను ‘క్రేజీ, లోకో, గోయింగ్‌ వైల్డ్‌, అవుట్‌ ఆఫ్‌  కంట్రోల్‌’ అని దాడిచేస్తుండడం వల్లనే ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరిని పక్కన పెట్టిందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి పోతుందని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని పావెల్‌ తెలిపినట్లు చెబుతున్నారు. 

డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు..!
వచ్చే నెలలో పెంపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశాయి. అయితే, 2019లో ఫెడ్‌ వైఖరి కఠినంగా ఉండనుందని భావించిన వీరికి.. పావెల్‌ వ్యాఖ్యలు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయి. వచ్చే ఏడాదిలో మూడు సార్లు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉందని అంచనా వేయగా.. ఇంతకంటే తక్కువ సార్లు పెంపునకు మాత్రమే అవకాశం ఉందని తాజా అంచనాలు మొదలయ్యాయి. You may be interested

భారీగా పెరుగుతున్న సంపద

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: భారత్‌లో అధిక విలువ కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంపద అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2017లో 22 శాతం పెరిగింది. ఆసియా ప్రాంతంలో ఇది వేగవంతమైన వృద్ధి అని క్యాప్‌జెమిని సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఒక మిలియన్‌ డాలర్లు (రూ.7 కోట్లకు పైగా) అంతకంటే ఎక్కువ సంపద (స్టాక్స్‌, బాండ్ల, ఇతర రూపాల్లో) కలిగిన వారిని

3 నెలల గరిష్టానికి రూపీ

Thursday 29th November 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం మరింత బలపడింది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.75 శాతం పెరుగుదలతో 70.09 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 70.62గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.17 వద్ద ప్రారంభమైంది.  ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యల వల్ల

Most from this category