News


లాభాల ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Friday 7th June 2019
Markets_main1559879427.png-26143

క్రితంరోజు భారీ నష్టాల్ని చవిచూసిన స్టాక్‌ మార్కెట్‌... శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 50 పాయింట్ల లాభంతో 39,581పాయింట్ల వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 100 పాయింట్ల నష్టంతో 39,425  పాయింట్ల వద్దకు తగ్గింది. 20 పాయింట్ల లాభంతో 11,865 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి..కొద్ది నిముషాల్లోనే 30 పాయింట్ల నష్టంతో 11,814  పాయింట్ల వద్దకు పడిపోయింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంత, విప్రోలు స్వల్పలాభంతో ప్రారంభంకాగా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, మారుతి, సన్‌ఫార్మాలు 1-2 శాతం మధ్య నష్టపోయాయి. 

 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  విప్రో:- విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను నుంచి అజీమ్ ప్రేమ్‌జీ పదవీ విరమణ చేయనున్నారు. జూలై 30 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. అయితే కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌గా మరో 5ఏళ్లు కొనసాగుతారు. ఆయన స్థానంలో తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. లిండే

చిన్నవే... కానీ సత్తా ఉన్నవి..!

Thursday 6th June 2019

లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు నిజానికి వేగంగా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీ మూలాలు బలంగా ఉండాలి, మంచి యాజమాన్యం ఉండాలి... ఇలా కొన్ని అంశాలు ఆయా కంపెనీల వ్యాపార భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇన్వెస్టర్లలో కొందరు అధిక రిస్క్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారి కావాల్సింది అధిక రాబడులు. మరి కంపెనీ వృద్ధి అవకాశాలతో పోలిస్తే చౌకగా లభించే మూడు చిన్న కంపెనీల వివరాలను వ్యాల్యూ

Most from this category