STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 11th June 2019
Markets_main1560225393.png-26212

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 39,900 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్లు జంప్‌చేసి 11,960 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేయగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, మహింద్రా షేర్లు 1-2 శాతం మధ్య ప్రారంభనష్టాల్ని చవిచూసాయి. ట్రేడ్‌వార్‌కు పరిష్కారంగా అమెరికాతో మెక్సికోకు డీల్‌ కుదిరిన నేపథ్యంలో చైనాతో కూడా ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. చైనా షాంఘై ఇండెక్స్‌ 2 శాతంపైగా ర్యాలీ జరపగా, జపాన్‌తో సహా మిగిలిన ప్రధాన ఆసియా సూచీలు 0.3-1 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 11th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- నేషనల్‌ హై వే ఆథారిటీ నుంచి రూ.150 కోట్ల విలువైన రెండు ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. లుపిన్‌:- జూన్‌ 13న బోర్డు జరిగిన సమావేశంలో తన అనుబంధ సంస్థ న్యూక్లియర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ విలీన అంశంపై చర్చించనుంది.  ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సౌకర్యంపై ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ రేటింగ్‌ను ఇండియా ఎ(+)

ఈ ఐదూ పెట్టుబడులకు మంచి ఆప్షన్లు

Tuesday 11th June 2019

ఎన్నో సవాళ్లతో కూడిన ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే వారు మూలాలు బలంగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఈ కంపెనీలు పుంజుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మంచి కంపెనీలను ఎంచుకోవాలంటే అందుకోసం వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, ఎర్నింగ్స్‌, మార్జిన్లు, రిటర్న్‌ రేషియోలు, ఎబిట్డా ఇవన్నీ పరిగణనలోకి

Most from this category